Friday, March 31, 2023
- Advertisment -
HomeEntertainmentJamuna | జమున బయోపిక్‌లో తమన్నా.. కీర్తిసురేశ్ మహానటి అంత సక్సెస్ అవుతుందా?

Jamuna | జమున బయోపిక్‌లో తమన్నా.. కీర్తిసురేశ్ మహానటి అంత సక్సెస్ అవుతుందా?

Jamuna | మహానటి సావిత్రి బయోపిక్ వచ్చింది. బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. సావిత్రి తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జమున బయోపిక్ కూడా తొందరలోనే రాబోతోంది. వెండితెర సత్యభామగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిన జమున పరమపదించిన నేపథ్యంలో ఈ న్యూస్ ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

జమున బయోపిక్ ఆలోచన ఇప్పుడు మొదలైంది కాదు.. ఆమె బతికి ఉన్నప్పుడే ఓ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ స్క్రిప్టు రెడీ చేశాడు. ఈ సినిమాకు సంబంధించి క్యాస్టింగ్ సెలక్షన్ కూడా అయిపోయినట్టు తెలుస్తోంది. జమున పాత్ర కోసం మిల్క్ బ్యూటీ తమన్నాను అనుకున్నారట. జమునలోని పొగరు, అల్లరి, అమాయకత్వం వంటి అన్ని కోణాలకు తమన్నా అయితేనే చక్కగా సరిపోతుందని మేకర్స్ భావించారట. అందుకే తమన్నాను సంప్రదిస్తే ఓకే చెప్పినట్టు కూడా తెలుస్తోంది. కీర్తి సురేశ్‌కు మహానటి సినిమా ఎంత క్రేజ్ తెచ్చిందో.. జమున బయోపిక్‌తో తనకు కూడా అంత పాపులారిటీ వస్తుందని ఆశపడి తమన్నా ఈ సినిమాను ఒప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జమున ఉండగానే ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నాడు. కానీ ఇంతలోనే ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది.

ప్రస్తుతం తమన్నా మెగాస్టార్ చిరంజీవితో భోళాశంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్‌తో జైలర్ సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు హిందీలో ఒక సినిమా, మలయాళంలో ఒక సినిమా చేస్తుంది. ఏదేమైనా జమున పాత్రలో తమన్నా ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Divyansha Kaushik | చైతూపై నాకు క్రష్ ఉంది.. నాగచైతన్యతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మజిలీ బ్యూటీ

Kajal Aggarwal | శ్రీలీలకు తల్లిగా కాజల్ అగర్వాల్.. బాలయ్య కోసం అంత సాహసం చేస్తుందా?

Rajinikanth | అనుమతి లేకుండా పేరు వాడితే… రజనీకాంత్ బహిరంగ హెచ్చరిక

Naresh | నన్ను చంపేందుకు కుట్ర.. కొత్త వివాదానికి తెరలేపిన సీనియర్ నటుడు నరేశ్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News