Saturday, April 20, 2024
- Advertisment -
HomeNewsAPTarakaratna | 45 నిమిషాలు గుండె ఆగడంతో తారకరత్న మెదడు వాచింది.. ఆరోగ్య పరిస్థితి వివరించిన...

Tarakaratna | 45 నిమిషాలు గుండె ఆగడంతో తారకరత్న మెదడు వాచింది.. ఆరోగ్య పరిస్థితి వివరించిన విజయసాయిరెడ్డి

Tarakaratna | తీవ్ర గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన నందమూరి తారకరత్న ఆరోగ్యంపై ఇంకా ఆందోళనలు తగ్గడం లేదు. తారకరత్న పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. కాకపోతే చికిత్సకు స్పందిస్తున్నాడు.. రోజురోజుకీ ఇంప్రూవ్‌మెంట్‌ కనిపిస్తుంది. నారాయణ హృదయాలయ వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసినా.. నందమూరి ఫ్యామిలీ మీడియాతో మాట్లాడిన ఇదే చెబుతున్నారు. కానీ తారకరత్న అసలు పరిస్థితి ఏంటనేది మాత్రం చెప్పడం లేదు. ఈ క్రమంలోనే బెంగళూరులోని నారాయణ హృదయాలయకు వెళ్లి తారకరత్నను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పరామర్శించాడు. అనంతరం అతని ఆరోగ్యం గురించి సంచలన విషయాలు బయటపెట్టాడు. బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పరామర్శించారు. తారకరత్నకు అందుతున్న వైద్యాన్ని అడిగి తెలుసుకున్నారు.

తారకరత్న గుండె బాగానే పనిచేస్తుందని వైద్యులు చెప్పారని విజయసాయిరెడ్డి తెలిపారు. ‘ 45 నిమిషాలు గుండె ఆగిపోవడం వల్ల మెదడు పైభాగం దెబ్బతింది. మెదడులో నీరు చేరడంతో మెదడు వాచింది. వాపు తగ్గిన వెంటనే బ్రెయిన్‌ రికవరీ అవుతుందని డాక్టర్లు చెప్పారు’ అని ఆయన పేర్కొన్నారు. దగ్గరుండి అన్ని తారకరత్నకు అందుతున్న వైద్య సదుపాయాలు చూసుకుంటున్న బాలకృష్ణకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Andhra Pradesh Capital | ఏపీ సీఎం జగన్‌ కీలక ప్రకటన.. ట్విటర్ ట్రెండింగ్‌లో నిలిచిన విశాఖపట్నం

YS Jagan | విశాఖ నుంచే పరిపాలన.. గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో కన్ఫార్మ్ చేసిన ఏపీ సీఎం జగన్

LPG Cylinder | గ్యాస్ సిలిండర్ డెలివరీకి డబ్బులు అడుగుతున్నారా? ఈ నంబర్‌కు కాల్ చేయండి

AP CM Jagan | తోడేళ్లు అన్నీ ఒక్కటవుతున్నాయి.. మీ బిడ్డ సింహంలా ఒక్కడే నడుస్తాడు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై ఏపీ సీఎం జగన్ సెటైర్లు

Tarakaratna | విషమంగానే నందమూరి తారకరత్న ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుదల

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News