Monday, April 15, 2024
- Advertisment -
HomeLatest NewsPonguleti Srinivas Reddy | వైఎస్సార్‌టీపీలోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ? స్పష్టత ఇచ్చిన వైఎస్...

Ponguleti Srinivas Reddy | వైఎస్సార్‌టీపీలోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ? స్పష్టత ఇచ్చిన వైఎస్ షర్మిల

Ponguleti Srinivas Reddy | ఖమ్మం రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్‌లో కీలక నేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరుతారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అమిత్ షాను కలిసి ఆ పార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్‌టీపీలో చేరుతారని షర్మిల చెప్పారు. ఈ మేరకు తనకు మాట ఇచ్చారంటూ బాంబు పేల్చారు. ఇవాళ్టి నుంచి ప్రజాప్రస్థాన పాదయాత్ర తిరిగి పున: ప్రారంభింస్తోంది షర్మిల. పాదయాత్ర ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే షర్మిల పాదయాత్ర కొనసాగించనున్నారు. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడిన షర్మిల.. ఇటీవల పొంగులేటి తనను కలిసిన మాట వాస్తవమేనని అన్నారు. ఏ సమయంలో ఏది జరగాలో అదే జరుగుతుందని, ఏ సమయంలో చేరికలు ఉండాలో అప్పుడే ఉంటాయని షర్మిల చెప్పుకొచ్చారు. పొంగులేటి తమ పార్టీలో చేరతారని, తనకు మాట ఇచ్చారని స్పష్టం చేశారు.

ఇటీవలే పొంగులేటి కూడా ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయని వ్యాఖ్యానించారు. అటూ షర్మిల కూడ ఓ సందర్భంలో ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయని అన్నారు. దీన్ని బట్టి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైఎస్సార్‌టీపీవైపే మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Hindenburg Report | హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. బిలియనీర్స్ టాప్ 10లో చోటు కోల్పోయిన అదానీ

Hindenburg Research | కుబేరుల జాబితానే తలకిందులు చేసిన అంబులెన్స్‌ డ్రైవర్‌.. గౌతమ్ అదానీ షేర్ల పతనం వెనుక ఆయనే !

Google | షాక్ ఇచ్చిన సెర్చింజిన్‌ సంస్థ..12 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన!

Dollar | అన్ని దేశాల కరెన్సీలను డాలర్‌తోనే ఎందుకు పోలుస్తారు.. దీనికి కారణమేంటని ఎప్పుడైనా ఆలోచించారా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News