Tuesday, July 23, 2024
- Advertisment -
HomeLatest NewsMinister KTR | దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేయండి.. ముందస్తుకు వెళ్దాం.. బీజేపీకి తెలంగాణ మంత్రి...

Minister KTR | దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేయండి.. ముందస్తుకు వెళ్దాం.. బీజేపీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాలు

Minister KTR | బీజేపీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇన్నేళ్లు అయినా ఒక్క పైసా కూడా మోదీ ప్రభుత్వం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. పేరుకేమో సబ్‌కా సాత్.. చేతలేమో సబ్ కుచ్ బక్వాస్ అని ఎద్దేవా చేశారు. మోదీకి ఇదే చివరి బడ్జెట్ అని.. తెలంగాణ పట్ల మీ చిత్తశుద్ది చాటుకోవడానికి ఇదే చివరి అవకాశమని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు.

ఇదే నా సవాలు

నిజామాబాద్‌లో పసుపు బోర్డు మాట దేవుడెరుగు.. ఉన్న జూట్ బోర్డు కూడా మోదీ ప్రభుత్వం ఎత్తేస్తుందని కేటీఆర్ విమర్శించారు. కేంద్రం తెలంగాణకు ఇచ్చేదానికంటే కూడా.. పన్నుల రూపంలో రాష్ట్రమే కేంద్రానికి ఎక్కువ ఇస్తుందని ఈ సందర్భంగా చెప్పారు. కేంద్ర పథకాలను కేసీఆర్ మారుస్తుండని ఒకాయన అంటాడు.. ఆయనకు సవాలు వేస్తున్నా.. పక్కన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల్లో మీ ప్రభుత్వాలే ఉన్నాయి కదా.. పోయి చూద్దామా.. ఎక్కడైనా తెలంగాణలో ఉన్న మిషన్ భగీరథ, రైతు వేదికలు, ఇంటింటికి నల్లా పథకాలు ఉన్నాయో చూద్దామా అని సవాలు విసిరారు. దేశంలోని బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇలాంటి పథకాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.

ఢిల్లీలో ఉన్నోళ్లకి బుద్ధిలేదా? గల్లీలో ఉన్న వాళ్లకా?

పల్లె ప్రగతి అవార్డులు మీరే ఇస్తారు.. ఇండియాలో టాప్ 20 పంచాయతీలు ఎక్కడ ఉన్నాయంటే 19 గ్రామాలు తెలంగాణలో ఉన్నాయని మీరే అవార్డులు ఇస్తారు. మున్సిపాలిటీలు బెస్ట్ ఎక్కడ అంటే మనకే అవార్డులు ఇస్తారు. ఢిల్లీ వాళ్లేమో అవార్డులు ఇస్తారు.. గల్లీ బీజేపీ లీడర్లు ఏమో కారు కూతలు కూస్తారని అన్నారు. అయితే ఢిల్లీలో ఉన్నోడికైనా బుద్ధిలేదు.. లేదా గల్లీలో ఉన్నోడికైనా బుద్దిలేదని ఎద్దేవా చేశారు. ఎవరికి బుద్దిలేదో వాళ్లే తేల్చుకోవాలని అన్నారు. తెలంగాణ కంటే మెరుగైన సంక్షేమ పాలన ఎక్కడైనా ఉందా? అని బీజేపీ నేతలను ప్రశ్నించారు.

మీకంటే బాగా బూతులు వచ్చు

తెల్లారి లేస్తే సీఎం కేసీఆర్‌ను తిట్టుడు.. మంత్రులను బూతులు మాట్లాడుడు.. సంస్కారహీనంగా మాట్లాడుడు చూస్తూనే ఉన్నాం.. మాట్లాడాలని అనుకుంటే మీ అయ్యలు.. తాతలు గుర్తొచ్చేలా మాట్లాడే సత్తా మాక్కూడా ఉంది. మీకంటే బాగా మాట్లాడగలుగుతం. అది బూతులైనా.. ఏదైనా.. బ్రహ్మాండంగా మాట్లాడగులుతం. ఓ పెద్ద మనిషి డీ శ్రీనివాస్ కొడుకువని ఊకుంటున్నం అంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి సంజయ్‌పై కేటీఆర్ మండిపడ్డారు. ఇక్కడ డైలాగులు చెప్పుడు కాదు.. దమ్ముంటే చేతనైతే, కేంద్రంలో పలుకుబడి ఉంటే తెలంగాణకు ఇచ్చిన హామీలను నువ్వు, మీ అధ్యక్షుడు సాధించుకుని తీసుకుని రమ్మని డిమాండ్ చేశాడు. దమ్ముంటే పార్లమెంటు రద్దు చేసి ముందస్తుకు పోదామని సవాలు విసిరారు. ఎవరెందో ప్రజలే తేలుస్తారని ఆయన స్పష్టం చేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Australian Open 2023 | ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సరికొత్త ఛాంపియన్‌గా సబలెంకా!

Nandamuri Tarakaratna | అత్యంత విషమంగా నందమూరి తారకరత్న ఆరోగ్యం.. ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాస

Vijayashanthi on KCR | తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విజయశాంతి కీలక వ్యాఖ్యలు.. ఆయనో విష సర్పం!

Layoff | ఇంటర్వ్యూ చేస్తుండగానే హెచ్ఆర్ ఉద్యోగం ఔట్.. గూగుల్‌లో లే ఆఫ్‌ ఎఫెక్ట్!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News