Home News International Mark Zuckerberg | ఎప్పుడూ ఒకే తరహా టీ షర్టులో కనిపించే జూకర్‌ బర్గ్ నయా...

Mark Zuckerberg | ఎప్పుడూ ఒకే తరహా టీ షర్టులో కనిపించే జూకర్‌ బర్గ్ నయా లుక్‌.. ఇన్‌స్టాగ్రామ్‌లో శుభవార్త పంచుకున్న జుకర్‌

Image Source: Mark Zuckerberg Instagram

Mark Zuckerberg | కొత్త సంవత్సరం వేళ మెటా ( ఫేస్‌బుక్‌ ) సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ గుడ్‌ న్యూస్‌ పంచుకున్నారు. మూడోసారి తండ్రి కాబోతున్నట్లు వెల్లడించారు. తన భార్య ప్రిసిల్లా బేబి బంప్‌పై చేయి పెట్టి దిగిన ఫొటోను జుకర్‌ బర్గ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేస్తూ ఈ విషయాన్ని చెప్పారు. ఈ ఏడాది తమ కుటుంబంలోకి మరో చిన్నారి వస్తున్నారని తెలిపారు. హ్యా్పీ న్యూ ఇయర్‌.. మా ప్రేమకు ప్రతిరూపమైన మరో వ్యక్తి ఈ ఏడాది మా కుటుంబంలోకి రాబోతున్నారు అని పేర్కొన్నారు. అయితే ఎప్పుడూ ఒకే తరహా టీ షర్టు ధరించే జుకర్ బర్గ్.. ఈ ఫొటోలో మాత్రం బ్లాక్‌ సూట్‌ ధరించడం విశేషం.

గత ఏడాది సెప్టెంబరులోనూ జుకర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టారు. మూడోసారి తండ్రి అవుతున్నానని చెప్పారు. ప్రిసిల్లా చాన్‌ మూడోసారి ప్రెగ్నెంట్‌ అయిందని చెప్పారు. మ్యాక్సిమా, ఆగస్ట్‌కు వచ్చే ఏడాది చెల్లి రాబోతుందని చెబుతూ భార్యతో కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేశారు.

హార్వర్డ్‌ యూనివర్సిటీలో 2003లో జుకర్‌ బర్గ్‌, ప్రిసిల్లా చాన్‌ కలుసుకున్నారు. కొన్నేళ్ల పాటు డేటింగ్‌ చేసి 2012 మే 19న పెళ్లి చేసుకున్నారు. వీరికి 2015లో మాక్సిమా అనే అమ్మాయి జన్మించింది. 2017లో ఆగస్ట్‌లో రెండో సారి పాప జన్మించింది. ఆమెకు ఆగస్ట్‌ అనే పేరు పెట్టారు. తాజాగా మరో పాప పుట్టబోతున్నట్లు ప్రకటించారు. అమెరికాలో లింగ నిర్ధారణ ముందే చేసుకోవచ్చు. అందుకే మూడోసారి అమ్మాయి పుట్టబోతుందని జుకర్‌ దంపతులు ప్రకటించారు. భారత్‌లో మాత్రమే లింగ నిర్ధారణ చేయడాన్ని నిషేధించారు.

కాగా మొదటిసారి పాప పుట్టిన సంతోషంలో జుకర్‌ బర్గ్‌ దంపతులు రూ.౩ లక్షల కోట్ల విరాళం ప్రకటించి సంచలన సృష్టించారు. కంపెనీలో తమకున్న 99 శాతం షేర్లను విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తమ జీవితకాలంలో ఈ విరాళాన్ని ఇవ్వనున్నట్లు జుకర్‌ బర్గ్‌, ప్రిసిల్లా చాన్‌ వెల్లడించారు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

BRS Andhra Pradesh president | బీఆర్‌ఎస్‌ వైపు ఏపీ నాయకుల చూపులు.. ఏపీ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు అయనేనా?

Tamil nadu | ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డీఏ పెంచిన తమిళనాడు సీఎం

Chandrababu | చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట.. ముగ్గురు మహిళల మృతి.. పలువురి పరిస్థితి విషమం

SI, Constable Mains | ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Exit mobile version