Home Latest News Tamil nadu | ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డీఏ పెంచిన తమిళనాడు సీఎం

Tamil nadu | ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డీఏ పెంచిన తమిళనాడు సీఎం

Image Source: @mkstalin twitter

Tamil nadu | ప్రభుత్వ ఉద్యోగులకు తమిళనాడు సీఎం స్టాలిన్‌ కొత్త సంవత్సరం కానుక అందించారు. ఉపాధ్యాయులతోపాటు పెన్షనర్లకు డీఏ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్టాలిన్‌ నిర్ణయంతో తమినాడులో 16 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.

ప్రస్తుతం తమిళనాడులో ప్రభుత్వ ఉపాధ్యాయులు, పెన్షనర్లకు 34 శాతం ఉన్న డీఏను 38 శాతానికి పెంచుతూ స్టాలిన్‌ నిర్ణయం తీసుకున్నారు. డీఏ పెంపును ఉద్యోగులకు న్యూ ఇయర్‌ బహుమతిగా స్టాలిన్‌ పేర్కొన్నారు. జనవరి 1 నుంచే పెంచిన డీఏ అమల్లోకి వస్తుందని ప్రకటించారు. పెన్షనర్లు, ఉపాధ్యాయులు కలిపి 16 లక్షల మందికి తాజా నిర్ణయంతో లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వంపై ఏడాదికి రూ. 2,359 కోట్ల అదనపు భారం పడనుంది.

మరోవైపు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్ ఉపాధ్యాయులు కొద్దిరోజులుగా తమిళనాడులో ఆందోళన చేస్తున్నారు. దీనిపైనా స్పందించిన స్టాలిన్‌.. ప్రత్యేక కమిటీ వేస్తున్నట్లు వెల్లడించారు. కమిటీ సిఫారసుల మేరకు నిర్ణయం తీసుకుంటామని స్టాలిన్‌ ప్రకటించారు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

BRS Andhra Pradesh president | బీఆర్‌ఎస్‌ వైపు ఏపీ నాయకుల చూపులు.. ఏపీ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు అయనేనా?

Free Ration | తెల్ల రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఉచిత బియ్యం పంపిణీకి ఏపీ సీఎం జగన్ నిర్ణయం

SI, Constable Mains | ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Job notifications | తెలంగాణలో కొనసాగుతున్న కొలువుల జాతర.. న్యూఇయర్‌ ముందు మరో నాలుగు నోటిఫికేషన్లు జారీ

Accident | ఇద్దరి ప్రాణాలు తీసిన న్యూఇయర్ జోష్.. బంజారాహిల్స్‌లో కారు బీభత్సం

Corona | చైనాలో రోజుకు 9 వేల కరోనా మరణాలు.. మార్చినాటికి 100 కోట్ల మందికి వైరస్!

Exit mobile version