Home Latest News Viral news | అమెరికాలో కోట్ల జీతం వదిలేసి వచ్చి సన్యాసం పుచ్చుకోబోతున్న యంగ్‌ సైంటిస్ట్‌

Viral news | అమెరికాలో కోట్ల జీతం వదిలేసి వచ్చి సన్యాసం పుచ్చుకోబోతున్న యంగ్‌ సైంటిస్ట్‌

Viral news | కోట్లలో జీతం.. ఖరీదైన కార్లు.. లగ్జరీ భవనాలు.. ఇదేనా జీవితం ! ఆత్మ సంతృప్తి లేని ఆడంబరాలు ఎందుకు? మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడి మనసుకి సరిగ్గా ఇదే అనిపించింది. కోట్లు సంపాదించడం కంటే కూడా సన్యాసిగా మారి ప్రశాంతంగా గడపడం బెటర్‌ అనిపించింది. అందుకే అమెరికాలో కోట్ల జీతాన్ని వదులుకొని వచ్చి సన్యాసిగా మారబోతున్నాడు.

మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రన్‌సుఖ్‌ కాంతేడ్‌ (28) ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. 2016లో ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాడు. చదువు పూర్తయ్యాక అక్కడే డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగంలో చేరాడు. లక్షల్లో కాదు కోట్లలో జీతం సంపాదించాడు. అతని జీతం ఏడాదికి కోటి ఇరవై అయిదు లక్షలు. కార్లు, బంగ్లాలతో లగ్జరీ జీవితం అతని సొంతమైంది. కానీ అవేవీ అతనికి సంతృప్తిని ఇవ్వలేదు. జీవితంలో ఇంకా ఏదో లోటు ఉందని భావించాడు. చివరకు తత్వాన్ని బోధపరుచుకున్నాడు. అందుకే ఆడంబరాలు అన్నిటిని వదిలేసి సన్యాసిగా శేష జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నాడు.

కోట్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసుకున్నాడు. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియాకు తిరిగొచ్చేశాడు. 2021 జనవరిలో అమెరికా నుంచి వచ్చిన ప్రన్‌సుఖ్‌.. జైన సన్యాసిగా మారాలని అనుకున్నాడు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. వాళ్లు కూడా ప్రన్‌సుఖ్‌ నిర్ణయానికి అడ్డు చెప్పలేదు. బిడ్డ సంతోషమే తమ సంతోషమని ఓకే చెప్పారు. దీంతో ఈ నెల 26న జినేంద్ర ముని వద్ద జైన సన్యాస దీక్ష తీసుకునేందుకు ఫిక్సయ్యాడు. అదే రోజు ప్రన్‌సుఖ్‌తో పాటు మరో ఇద్దరు జైన సన్యాస దీక్ష తీసుకోబోతున్నారు. ఈ కార్యక్రమానికి 53 మంది జైన సాధువులు హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

DMHO Srinivasa rao | ఏసుక్రీస్తు దయవల్లే భారత్‌లో కరోనా తగ్గింది.. తెలంగాణ డీఎంఎచ్‌ఓ శ్రీనివాస్‌రావు వివాదాస్పద వ్యాఖ్యలు

Omicron BF.7 Symptoms | చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ BF.7 లక్షణాలివే..

కరోనా లాక్‌డౌన్‌ తెచ్చిన భయం.. మూడేళ్లుగా గదిలో నుంచి బయటకు రాని తల్లీకూతుళ్లు

Omicron BF.7 variant | భారత్‌లోకి ప్రవేశించిన ఒమిక్రాన్ సబ్‌ వేరియంట్‌ BF.7.. చైనాను అతలాకుతలం చేస్తోంది ఇదే

Adar Poonawalla on corona cases | కరోనా కేసులు పెరుగుతుండటంపై అదార్ పూనావాలా కీలక వ్యాఖ్యలు.. అప్రమత్తంగా ఉండాల్సిందే కానీ..

Exit mobile version