Home News International Kuwait | కువైట్‌లో డ్రైవర్లుగా చేస్తున్న వారికి షాక్.. 66వేల మంది డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు.....

Kuwait | కువైట్‌లో డ్రైవర్లుగా చేస్తున్న వారికి షాక్.. 66వేల మంది డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు.. 3 లక్షల దాకా క్యాన్సిల్ చేసే ఛాన్స్ !

Kuwait | ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారికి కువైట్ షాకిచ్చింది. భారత్‌తో పాటు ఇతర దేశాల వారికి జారీ చేసిన 66 వేల డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేసింది. త్వరలో 3 లక్షల వరకు డ్రైవింగ్ లైసెన్స్‌లను క్యాన్సిల్ చేయాలని కువైట్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ రద్దీని నియంత్రించడంలో భాగంగానే ఇలా విదేశీయులకు ఇచ్చిన డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేస్తున్నామని కువైట్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు విదేశీయులు కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఉన్న నిబంధనలను కూడా కఠినతరం చేసింది. భారత కరెన్సీ ప్రకారం నెలకు లక్షన్నర వేతనం ఉంటేనే విదేశీయులకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలనే నిబంధన తీసుకొచ్చింది. కారణం ఏదైనా ఈ నిర్ణయం తెలుగు రాష్ట్రాల నుంచి కువైట్ వలస వెళ్లిన వేలాది మందికి అశనిపాతంగా మారింది.

తెలుగు రాష్ట్రాల్లోని పల్లెల నుంచి చాలామంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారు. వీరిలో చాలామంది కువైట్‌కి వెళ్లి పొట్టపోసుకుంటున్నారు. అక్కడి అరబ్బుల వద్ద డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. కొంతమంది సొంతంగా వాహనాలను కొనుగోలు చేసి ట్యాక్సీలుగా నడిపిస్తున్నారు. ఎంతో కొంత సంపాదించుకుంటున్నారు. కానీ ఇప్పుడు కువైట్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అలా ఉపాధి పొందుతున్న వారిలో చాలామంది తమ ఉద్యోగులు కోల్పోయే పరిస్థితి వచ్చేసింది. ఇదే విషయం భారత్‌లో ఉన్న తమ బంధువులతో చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది?

ఇటీవల కువైట్‌లో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఈ రద్దీని నియంత్రించడంలో భాగంగా విదేశీయులకు జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేయాలని నిర్ణయించింది. అలా అని విదేశీయులకు ఇచ్చిన అందరి లైసెన్స్‌లను కువైట్ ప్రభుత్వం క్యాన్సిల్ చేయడం లేదు. కొన్నేళ్ల కింద విచ్చలవిడిగా డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇచ్చారు. దీంతో ఆ లొసుగుల ఆధారంగా కొంతమంది తప్పుడు ఆధారాలతో డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందారని కువైట్ ప్రభుత్వం గుర్తించింది. అందుకే దిద్దుబాటు చర్యల్లో భాగంగా అక్రమంగా పొందిన లైసెన్స్‌లనే రద్దు చేయాలని కువైట్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లిన వారిలో చాలామంది అర్హత లేకపోయినా తప్పుడు ఆధారాలతో డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందారు. అప్పుడు గత్యంతరం లేక తప్పుడు మార్గాల్లో వెళ్లిన వారే ఇప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Tamannah Bhatia | 30 ఏళ్లలోపే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కనాలని అనుకున్నా.. తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Bandi Sanjay | ధరణిని రద్దు చేయం.. కేసీఆర్ పథకాలను అలాగే కొనసాగిస్తాం.. రూట్ మార్చేసిన బండి సంజయ్

Pawan Kalyan | నా చెప్పులు నాకు ఇప్పించండి ప్లీజ్‌.. పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ కౌంటర్‌

Adipurush | ఆదిపురుష్ సినిమా చూసేందుకు వచ్చిన హనుమంతుడు.. జై శ్రీరామ్ అంటూ మార్మోగిన సినిమా హాల్

Weather Updates | బిపర్‌జాయ్ ఎఫెక్ట్.. తెలంగాణలో వర్షాలు బంద్.. జూన్ చివరిదాకా ఎండలే !

Exit mobile version