Home Latest News Rahul Gandhi | ఆర్ఎస్ఎస్, బీజేపీపై రాహుల్ గాంధీ ఫైర్.. కౌరవులతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు

Rahul Gandhi | ఆర్ఎస్ఎస్, బీజేపీపై రాహుల్ గాంధీ ఫైర్.. కౌరవులతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు

Rahul Gandhi | రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( RSS ), బీజేపీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను మహాభారతంలోని కౌరవులతో పోలుస్తూ ఎద్దేవా చేశారు. 21 శతాబ్దపు కౌరవులు ఖాకీ ప్యాంటు వేసుకుంటారని, చేతిలో లాఠీ పట్టుకుని తిరుగుతుంటారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా శాఖలుగా విస్తరిస్తారని వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. ఇప్పుడున్న కౌరవులకు ఇద్దరు ముగ్గురు కోటీశ్వరులు అండగా ఉంటారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భారత్ జోడో యాత్రలో భాగంగా హరియాణాలో పర్యటిస్తున్న రాహుల్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు చేసింది ప్రధాని మోదీ అయినా ఆయన చేత సంతకం పెట్టించింది మాత్రం ఇద్దరు ముగ్గురు కోటీశ్వరులే అని ఆరోపించారు. మరోవైపు బీజేపీ నేతలను రాహుల్ గాంధీ పాండవులతో పోల్చారు.

ఒకప్పటి రాహుల్ గాంధీనీ కాదు..

పాండవులు నోట్లు రద్దు చేస్తారా? జీఎస్టీ అమలు చేస్తారా? ఎక్కడైనా పాండవులు విద్వేషాన్ని వ్యాప్తి చేయడం చేస్తారా ? అమాయకులపై నేరాలకు పాల్పడతారా? అంటూ తీవ్ర స్థాయిలో రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. పాండవులు అన్నిమతాల వారిని ఆదరించడమే కాదు.. అన్యాయాన్ని ఎదురిస్తారని వ్యాఖ్యానించారు. భారతీయ విలువలకు సంఘ్ వ్యతిరేకమన్న రాహుల్ గాంధీ.. హర హర మహదేవ్, జై శ్రీరామ్ అని ఏ రోజూ సంఘ్ కార్యకర్తల నోటి నుంచి రాలేదని వ్యాఖ్యానించారు. తాను ఒకప్పటి రాహుల్ గాంధీని కాదని తేల్చి చెప్పారు. అప్పటి రాహుల్ గాంధీ ప్రతిరూపాన్ని చంపేశానని కీలక వ్యాఖ్యలు చేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More:

Telangana Assembly Elections | తెలంగాణలో కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా ? మార్చిలో ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా ?

Chandrababu | తెలంగాణలో టీడీపీ మళ్లీ పుంజుకుంటే నష్టం ఎవరికి ? లాభం ఎవరికి .. చంద్రబాబు ఎత్తుగడ అదేనా!

Roja Vs Nagababu | జబర్దస్త్ మాజీ జడ్జీల మధ్య మాటల యుద్ధం.. అప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తుంది.. నాగబాబుపై రోజా తీవ్ర వ్యాఖ్యలు

Breaking News | గుండెపోటుతో చిన్నకొడుకు.. శ్మశానానికి తరలిస్తుండగా పెద్దకొడుకు.. గంట వ్యవధిలో ఇద్దరు మృతి.. మెట్‌పల్లిలో విషాదం

Saleswaram Temple | నల్లమలలో ఉన్న సలేశ్వరం ప్రత్యేకత తెలుసా? ఏడాదిలో కొన్ని రోజులే ఈ గుడి తెరుస్తారు.. కారణమిదే!

Ponguleti Srinivas Reddy | బీఆర్ఎస్‌కు షాక్.. బీజేపీలోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి… నేరుగా రంగంలోకి దిగిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ?

Exit mobile version