Saturday, April 20, 2024
- Advertisment -
HomeEntertainmentJunior NTR on Taraka ratna | తారకరత్న ఆరోగ్యం క్రిటికల్‌గా ఉన్నా.. వైద్యానికి సహకరిస్తున్నారు:...

Junior NTR on Taraka ratna | తారకరత్న ఆరోగ్యం క్రిటికల్‌గా ఉన్నా.. వైద్యానికి సహకరిస్తున్నారు: జూనియర్ ఎన్టీఆర్

Junior NTR on Taraka ratna | తారకరత్న ఆరోగ్యం క్రిటికల్‌గా ఉన్నా వైద్యానికి సహకరిస్తున్నారని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. నిన్నటితో పోలిస్తే పరిస్థితి మెరుగ్గా ఉందని, వైద్యానికి స్పందిస్తున్నారని వైద్యులు చెప్పినట్లు పేర్కొన్నారు. సోదరుడు కళ్యాణ్‌రామ్‌తో కలసి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్లారు. తారకరత్నను పరామర్శించారు. వైద్యం అందుతున్న తీరు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎన్టీఆర్.. అభిమానులు, అందరి ప్రార్థనలతో తారకరత్న ఆరోగ్యంగా బయటకు వస్తారని ఆశిస్తున్నామన్నారు.

తాతగారి ఆశిస్సులు, దేవుడి దీవెనలు తారకరత్నకు బలంగా ఉన్నాయని ఎన్టీఆర్ అన్నారు. తారకరత్న పోరాడుతున్నారని, ఆయనకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని అన్నారు. ఐసీయూలో తారకరత్నను పలకరించే ప్రయత్నం చేశానని, కొంత స్పందన కనిపించిందన్నారు. నిన్నటితో పోలిస్తే పరిస్థితి మెరుగ్గా ఉందని, అభిమానుల ప్రత్యేక పూజలతో తారకరత్న పూర్వస్థితికి వస్తారని అన్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు .

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Naresh | నన్ను చంపేందుకు కుట్ర.. కొత్త వివాదానికి తెరలేపిన సీనియర్ నటుడు నరేశ్

Tarakaratna Health Update | తారకరత్న కుప్పం నుంచి బెంగళూరు నారాయణ ఆస్పత్రికి తరలింపు

Rajinikanth | ఆమె వల్లే అన్ని అలవాట్లు మానేశా.. రజినీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Vishnu Priya | యాంకర్ విష్ణు ప్రియ ఇంట విషాదం.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News