Tuesday, April 23, 2024
- Advertisment -
HomeNewsAPPawan Kalyan | మౌనంగా ఉండే పాలకుడు కోటలో ఉన్నా.. పేటలో ఉన్నా ఒకటే: ఏపీ...

Pawan Kalyan | మౌనంగా ఉండే పాలకుడు కోటలో ఉన్నా.. పేటలో ఉన్నా ఒకటే: ఏపీ సీఎం జగన్‌పై పవన్ కళ్యాణ్ సెటైర్లు

Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన అంధ బాలిక హత్య ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ స్పందించారు. ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలోనే జరిగిన ఈ ఘటన తనను కలచివేసిందని అన్నారు. కనీసం లోకాన్ని చూడాలేని ఆ ఆడబిడ్డను వేధించడమే కాకుండా అత్యంత కిరాతకంగా నరికి చంపిన మృగాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

ఈ ఘటనను శాంతిభద్రతల వైఫల్యంగా చూడాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ‘ సీఎం ఇంటి పరిసరాల్లో పటిష్టమైన పోలీసు పహారా, నిఘా వ్యవస్థలు పని చేస్తాయి. అయినా తాడేపల్లి ప్రాంతం అసాంఘిక శక్తులకు , గంజాయికీ అడ్డాగా మారిందంటే లోపం ఎక్కడ ఉంది’ అని ప్రశ్నించారు. ఏడాదిన్నర క్రితం ఆ ప్రాంతంలోనే ఓ యువతిపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుల్లో ఒకర్ని ఇప్పటికీ పట్టుకోలేకపోయారంటే వైఫల్యం ఎవరిదీ..? అని నిలదీశారు. తన నివాస పరిసరాల్లో పరిస్టితులనే సమీక్షించకుండా మౌనంగా ఉండే పాలకుడు కోటలో ఉన్నా పేటలో ఉన్నా ఒకటే అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పోలీసు శాఖకు అవార్డులు వచ్చాయి, దిశా చట్టం చేశామని చెప్పుకోవడమే తప్ప రాష్ట్రంలో ఆడబిడ్డలకు మాత్రం రక్షణ లేకుండా పోయిందని ఆయన మండిపడ్డారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు ఉన్నతాధికారులే పటిష్ట చర్యలు తీసుకోవాలి అని పవన్‌ డిమాండ్ చేశారు.

‘ అత్యాచారాలు చోటు చేసుకొంటున్నాయి అంటే తల్లి పెంపకంలోనే లోపం ఉంది. ఏదో దొంగతనానికి వచ్చి రేప్‌ చేశారు అంటూ వ్యాఖ్యానించే మంత్రులు ఉన్న ప్రభుత్వం ఇది. ఆడపడుచులపై అఘాయిత్యాలు సాగుతున్నా.. మహిళా కమిషన్‌ ఏం చేస్తోంది..? పదవులు ఇచ్చినవారిని మెప్పెంచేందుకు రాజకీయపరమైన ప్రకటనలు, నోటీసులు ఇస్తే మహిళలకు రక్షణ, భరోసా దక్కవని గుర్తించాలి. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైంది. గంజాయికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్‌ను మార్చేశారు. శాంతిభద్రతల వైఫల్యం, ఆడబిడ్డలపై అఘాయిత్యాలపై మహిళా సంఘాలు, మేధావులు, న్యాయ నిపుణులు గళమెత్తాలి..’ అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

KCR on Etela Rajender | ఈటల తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరతారా.. అసెంబ్లీలో కేసీఆర్‌ ఏమన్నారు.. ఈటల రియాక్షన్‌ ఏంటి?

bachelors | అందమైన అమ్మాయి దొరకాలని పెళ్లి కాని ప్రసాదుల పాద యాత్ర.. వీళ్లకు పిల్ల దొరికేనా !!

Jagapathi babu | ఏమైందో తెలియదు.. పోగొట్టుకున్నా ఆస్తులపై నోరువిప్పిన జగపతిబాబు..

Turkey earthquake | తుర్కియే భూకంపాన్ని అంచనా వేసిన శాస్త్రవేత్త హెచ్చరిక.. త్వరలో భారత్‌కు కూడా ముప్పే

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News