Wednesday, November 29, 2023
- Advertisment -
HomeEntertainmentKalyanRam | కళ్యాణ్ రామ్ లెక్క ఎక్కడ తప్పింది.. 20 ఏళ్లలో అది తీరనికలే అయిందిగా..!

KalyanRam | కళ్యాణ్ రామ్ లెక్క ఎక్కడ తప్పింది.. 20 ఏళ్లలో అది తీరనికలే అయిందిగా..!

KalyanRam | 20 ఏళ్లుగా అందుకోలేని రికార్డులను ఇప్పటికైనా అందుకోవాలని చాలా ప్రయత్నించాడు కళ్యాణ్ రామ్. కానీ ఏం చేస్తాం.. ఆయనకు కాలం కలిసిరాలేదు. దాంతో మరోసారి ఫ్లాప్ వెంట పడింది. కచ్చితంగా హిట్ కొడతా.. ఈ సారి బాక్సాఫీస్ బద్దలైపోతుంది చూడండి అంటూ నమ్మకంగా చెప్పాడు కానీ కథలో లోపాలతో తేలిపోయాడు ఈ హీరో. తాజాగా ఈయన నటించిన అమిగోస్ సినిమాకు 3 రోజుల్లో కనీసం 6 కోట్ల షేర్ కూడా రాలేదు. మొదటిరోజే సినిమాకు దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి. బింబిసార సినిమా మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా 7.50 కోట్ల షేర్ తీసుకొచ్చి బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్స్ వైపు పరుగులు పెడితే.. ఈ సినిమా ఫుల్ రన్‌లో కూడా అంత వసూలు చేసేలా కనిపించడం లేదు.

కొత్త దర్శకుడు రాజేంద్ర రెడ్డి తెరకెక్కించిన అమిగోస్‌పై ముందు నుంచి కూడా ఎందుకో మరి ఆడియన్స్‌కు అంతగా ఆసక్తి అయితే కనిపించలేదు. పైగా ప్రమోషన్ విషయంలోనూ ముందు నుంచి మైత్రి మూవీ మేకర్స్ కాస్త అలసత్వంగానే ఉన్నారు. సంక్రాంతి సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేయడంతో కళ్యాణ్ రామ్ సినిమా కనిపించకుండా పోయింది. విడుదలకు రెండు వారాల ముందు నుంచి హడావిడి చేసినా కూడా ప్రేక్షకులకు ఈ సినిమా వస్తుందనే విషయం పూర్తిగా రిజిష్టర్ కాలేదు. అదే ప్రభావం ఇప్పుడు వసూళ్లపై కూడా దారుణంగా పడింది.

ఎంతగా అంటే జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ప్రమోషన్ చేసినా కూడా అమిగోస్‌కు ఇంత కూడా కలిసిరాలేదు. ఇందులో ట్రిపుల్ రోల్ చేశాడు కళ్యాణ్. మూడింట్లో ముఖ్యంగా విలన్ పాత్రలో రప్ఫాడించాడు. కానీ అది సినిమాకు ఏ మాత్రం హెల్ప్ కాలేదు. ఐడియా కొత్తగా ఉన్నా.. మిగిలిన కథ అంతా రొటీన్‌గానే ఉండటంతో కళ్యాణ్ రామ్ ఆశ తీరలేదు. 20 ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడూ రెండు వరస విజయాలు అందుకోలేదు కళ్యాణ్. అమిగోస్‌తో అది చేయాలని చూశాడు కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Nayanthara | నా భర్తనే అవమానిస్తారా? ఆ హీరోతో జన్మలో నటించను.. మంగమ్మ శపథం పట్టిన నయనతార?

Actress Hema | కొత్త బిజినెస్‌ పెట్టా.. అందుకే సినిమాలు మానేశా.. అసలు విషయం చెప్పిన హేమ

Jagapathi babu | ఏమైందో తెలియదు.. పోగొట్టుకున్నా ఆస్తులపై నోరువిప్పిన జగపతిబాబు..

Gaalodu movie in aha | ఓటీటీలోకి వచ్చేస్తున్న సుడిగాలి సుధీర్‌ గాలోడు సినిమా

Ileana | ఇలియానాపై సౌత్ ఫిలిం ఇండస్ట్రీ బ్యాన్.. పదేళ్లుగా అందుకే టాలీవుడ్‌కు దూరమైన గోవా బ్యూటీ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News