Thursday, July 25, 2024
- Advertisment -
HomeLatest Newsboga shravani | జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ బోగ శ్రావణి రాజీనామా.. ఎమ్మెల్యే సంజయ్ వేధింపులు...

boga shravani | జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ బోగ శ్రావణి రాజీనామా.. ఎమ్మెల్యే సంజయ్ వేధింపులు భరించలేకపోతున్నా అంటూ కంటతడి

Jagitial muncipal chairperson boga shravani | జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ బోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను జిల్లా కలెక్టర్లకు అందజేశారు. ఈ సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రావణి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపులు భరించలేకే రాజీనామా చేస్తున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు.

తాను పదవి చేపట్టిన రెండో రోజు నుంచే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనపై కుట్రలు చేయడం మొదలుపెట్టారని బోగ శ్రావణి ఆరోపించారు. తన కుటుంబాన్ని కూడా బెదిరించారని పేర్కొన్నారు. మీకు పిల్లలు ఉన్నారు.. వ్యాపారాలు ఉన్నాయి జాగ్రత్త అని బెదిరిస్తున్నాడని తెలిపారు. డబ్బులు డిమాండ్ చేశారని పేర్కొన్నారు. నడిరోడ్డులో అమరవీరుల స్తూపం సాక్షిగా అవమానానికి గురయ్యానని విలపించారు.

బీసీ బిడ్డ ఎదుగుతుందని ఓర్వలేక దొర అహంకారంతో తనపై కక్ష కట్టారని ఆరోపించారు. ఈ మూడేళ్లు నరకయాతన అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవితను కలవకూడదని.. కేటీఆర్ పేరు ప్రస్తావించకూడదని తనకు హుకుం జారీ చేశాడని పేర్కొన్నారు. ఇన్నాళ్లూ ఎన్ని తిట్టినా భరించానని.. ఇకపై తనకు అంత ఓపిక లేదని అన్నారు. అందుకే మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఎమ్మెల్యే నుంచి తనకు ఆపద ఉందని.. తనకు, తన కుటుంబానికి ఏదైనా జరిగితే సంజయ్ కుమార్ బాధ్యుడని పేర్కొన్నారు. తమకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని వేడుకున్నారు. చివరగా తనకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Padma Awards | పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. చిన్న జీయర్‌ సహా 12 మంది తెలుగు వాళ్లకు పద్మ పురస్కారాలు

Uorfi Javed | నాలాంటి సింగిల్స్‌కు ముంబైలో ఇల్లు అద్దెకు దొరకడం కష్టమైపోయింది.. బిగ్‌బాస్‌ బ్యూటీ ఉర్ఫీ జావెద్‌ ఆవేదన

Women’s IPL | పురుషుల ఐపీఎల్‌ను మించిపోయిన మహిళల లీగ్‌.. రికార్డు ధరకు వేలం

Cholesterol | చెడు కొలెస్ట్రాల్‌కి మంచి కొలెస్ట్రాల్‌కి తేడా ఏంటి.. ? చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించుకోవాలి?

Republic Day | రిపబ్లిక్ డే సందర్భంగా 901 మందికి పోలీసు పతకాలు ప్రకటించిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారంటే..

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News