Home News International Corona | చైనాలో రోజుకు 9 వేల కరోనా మరణాలు.. మార్చినాటికి 100 కోట్ల మందికి...

Corona | చైనాలో రోజుకు 9 వేల కరోనా మరణాలు.. మార్చినాటికి 100 కోట్ల మందికి వైరస్!

Corona | చైనాలో కరోనా విజృంభిస్తోంది. రోజుకు లక్షల కేసులు నమోదవుతున్నాయని, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయని బ్రిటన్‌కు చెందిన ఆరోగ్య సంస్థ ఎయిర్‌ఫినిటి తెలిపింది. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నయని భావించిన చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు జారీ చేసింది. జీరో కోవిడ్ పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది. దీన్ని ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. ఆందోళన బాటపట్టారు. ఫలితంగా జీరో కోవిడ్ పాలసీని ఎత్తేసింది. దీంతో అప్పటినుంచి కరోనా కల్లోలం సృష్టిస్తోందని, ఈ నేపథ్యంలోనే చైనాలో రోజుకు సగటున 9వేల మరణాలు సంభవిస్తున్నాయని ఎయిర్‌ఫినిటి సంస్థ వెల్లడించింది.

ఒక్క డిసెంబరులోనే దాదాపు లక్షమందికి పైగా కరోనాతో మరణించి ఉంటారని అంచనా వేసింది. దాదాపు 1.8 కోట్ల కేసులు నమోదయ్యాయని తెలిపింది. ప్రస్తుతం చైనాలో రోజుకు 9వేల మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. మరో 15 రోజుల్లో రోజుకు 37 లక్షల కరోనా కేసులు నమోదవుతాయని ఎయిర్‌ఫినిటి సంస్థ తెలిపింది. నెలాఖరు నాటికి 5.84 లక్షల మరణాలు సంభవిస్తాయని తెలిపింది. మార్చినాటికి 100 కోట్ల మందికి కరోనా సోకే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు చైనా మాత్రం డిసెంబరు 30న ఒక్కరే కరోనాతో మరణించినట్లు ప్రకటించింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవ గణాంకాలను వెల్లడించాలని చైనా ప్రభుత్వానికి సూచించింది.

మరోవైపు చైనా గణాంకాల్లో పారదర్శకత లేకపోవడంతో మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతోందని బ్రిటన్‌కు చెందిన బయోసైన్స్ రిసోర్స్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ జోనాథన్ తెలిపారు. అంతర్జాతీయ మీడియా కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. కరోనా కేసులను దాచిపెట్టడం వల్లే సమస్య తీవ్రమవుతోందని ఆస్ట్రేలియా పత్రికలు పేర్కొన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ ఔట్ బ్రేక్ ఉందని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ పేర్కొన్నట్లు తెలిపింది. మరో మూడు నెలల్లో 100 కోట్ల మందికి కరోనా సోకే ప్రమాదం ఉందని తెలిపింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Dollar | అన్ని దేశాల కరెన్సీలను డాలర్‌తోనే ఎందుకు పోలుస్తారు.. దీనికి కారణమేంటని ఎప్పుడైనా ఆలోచించారా?

Pavitra Naresh | పవిత్ర లోకేశ్‌కు లిప్‌ కిస్‌ ఇచ్చి గుడ్‌ న్యూస్‌ చెప్పిన నరేశ్‌

Poorna | తల్లి కాబోతున్న నటి పూర్ణ.. న్యూఇయర్‌ వేళ గుడ్‌న్యూస్‌ షేర్‌ చేసుకున్న మలయాళ బ్యూటీ

Mystery Deaths | కరీంనగర్ జిల్లాలో అంతుచిక్కని వ్యాధి కలకలం.. ఒకే కుటుంబంలో నెల వ్యవధిలో నలుగురు మృతి

Exit mobile version