Home Lifestyle Do you know Interesting facts | కాకి తలపై తన్నితే అపశకునమా.. మరణం తప్పదా? సైన్స్ ఏం చెబుతోంది?

Interesting facts | కాకి తలపై తన్నితే అపశకునమా.. మరణం తప్పదా? సైన్స్ ఏం చెబుతోంది?

Interesting facts | పూర్వకాలం నుంచి మనం ఎన్నో ఆచారాలను పాటిస్తున్నాం. మరెన్నో నమ్మకాలను విశ్వసిస్తున్నాం. అలాంటి వాటిల్లో ఒకటి.. కాకి తలపై తన్నితే అపశకునమని. కాకి తలపై తన్నితే మరణవార్త వినాల్సి వస్తుందని.. ఏడేళ్ల పాటు శని పీడిస్తుందని నమ్ముతుంటారు. అందుకే ఎలాంటి అశుభం జరగొద్దంటే తలపై నుంచి స్నానం చేయాలని మన పెద్దలు చెబుతుంటారు. మరి ఇది నిజమేనా? కేవలం మూఢ నమ్మకం మాత్రమేనా? దీని వెనుక ఏదైనా శాస్త్రీయత ఉందా? ఒకసారి తెలుసుకుందాం..

నిజానికి పూర్వీకులు పెట్టిన ప్రతి ఆచారం వెనుక ఒక శాస్త్రీయ కోణం ఉంది. కాకి తలపై తన్నితే మంచిది కాదని చెప్పడానికి కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే.. కాకి గోళ్లు చాలా పదునుగా ఉంటాయి. వీటితోనే ఎలుకలను, చనిపోయన జంతువులను పీక్కుతింటాయి. కాబట్టి కుళ్లిపోయిన జంతువుల వ్యర్థాలు కాకి గోళ్లలోనే ఉండిపోతాయి. వాటిలోనే క్రిములు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఒకవేళ కాకి వేగంగా ఎగురుకుంటూ వచ్చి తలపై తన్నితే దాని గోళ్లు గుచ్చుకునే ప్రమాదం ఉంది.

అలా గోళ్లు గుచ్చుకుంటే.. కాకి గోళ్లకు అతుక్కున్న క్రిములు..మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల ఇన్‌ఫెక్షన్ అయ్యి మరణాలకు దారి తీస్తుంది. దీంతో కాకి తన్నితే మరణం సంభవిస్తుందనే నమ్మకం వెనుకటి నుంచి బలంగా ఉండిపోయింది. అందుకే కాకి తలపై తన్నితే వెంటనే తలస్నానం చేయాలని చెబుతారు. దీనివల్ల తలపై ఏమైనా క్రిములు చేరితో తొలగిపోతాయి.

కాకి తలపై తన్నితే అపశకునమని.. దోష నివారణకు కొంతమంది ఏవేవో చేస్తుంటారు. కానీ అవన్నీ మూఢనమ్మకాలే. కాకి తన్నినప్పడు తల స్నానం చేస్తే సరిపోతుంది. ఒకవేళ గాయమైతే చికిత్స తీసుకోవాలి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Personal Finance | ఒక వ్య‌క్తి ఎన్ని ఏళ్లు కిరాయి ఉంటే ఆ ఇల్లు అత‌ని సొంత‌మ‌వుతుంది?

Diabetes | డ‌యాబెటిస్ ఉన్న‌వాళ్లు సీతాఫ‌లాలు తినొచ్చా?

Vaasthu Tips | ఈ చెట్లు మీ ఇంట్లో ఉంటే ఆర్థికంగా నష్టపోవడం ఖాయం

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Exit mobile version