Sunday, March 26, 2023
- Advertisment -
HomeLatest NewsIB Recruitment 2023 | పదో తరగతి అర్హతతో ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఉద్యోగాలు.. ఎంపికైతే రూ....

IB Recruitment 2023 | పదో తరగతి అర్హతతో ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఉద్యోగాలు.. ఎంపికైతే రూ. 69 వేల వరకు జీతం!

IB Recruitment 2023 | మీరు పదో తరగతి పాస్‌ అయ్యారా? ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అదీ..
కేంద్ర హోం శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో. ఇంకెందుకు ఆలస్యం అప్లై చేసుకుని పరీక్షలకు సిద్ధం కండి. ఎన్ని పోస్టులున్నాయి.. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి మరి!

ఇంటెలిజెన్స్‌ బ్యూరో తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం 1,675 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. వీటిలో సెక్యూరిటీ అసిస్టెంట్‌/ఎగ్జిక్యూటివ్ పోస్టులు 1,525 ఉండగా.. మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులు 150 ఉన్నాయి. పదో తరగతి లేదా తత్సమాన కోర్సులు చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అలాగే ప్రాంతీయ భాషలో మాట్లాడటం, చదవడం, రాయడం వచ్చి ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం కచ్చితంగా ఉండాలి.

సెక్యూరిటీ అసిస్టెంట్‌/ఎగ్జిక్యూటివ్ పోస్టులకైతే వయసు 27 ఏళ్లకు మించకూడదు. మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వాళ్లు ఫిబ్రవరి 17 నాటికి 18 నుంచి 25 ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల పాటు సడలింపు ఉంది. జనవరి 21 నుంచి ఆన్‌ లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. అయితే టెక్నికల్ సమస్యలతో తేదీలను మార్చారు. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 17 వరకు దరఖాస్తుల సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ముందుగా రూ.500 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

    3 దశల్లో రాత పరీక్ష ఉంటుంది. ఆన్‌ లైన్‌/ ఆఫ్‌ లైన్‌ రెండు విధాలుగా పరీక్షలు నిర్వహిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన ఉత్తీర్ణత ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సెక్యూరిటీ అసిస్టెంట్‌/ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనం రూ.21,700 నుంచి రూ.69,100 ఉండగా.. మల్టీ టాస్క్‌ పోస్టులకు రూ.18 వేల నుంచి రూ.65,900 వరకు జీతంగా చెల్లిస్తారు. అదనంగా అలవెన్సులు కూడా ఉంటాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

    Follow Us :  Google News, FacebookTwitter

    Read More Articles:

    Umesh Yadav | క్రికెటర్ ఉమేశ్‌ యాదవ్‌‌ని ముంచేసిన స్నేహితుడు.. మేనేజర్‌గా పెట్టుకుంటే లక్షలు కొట్టేశాడు!

    BBC Documentary row | ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ…. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

    Narendra Modi Security | ఎన్‌‌ఎస్‌జీ కమాండో వేషంలో ప్రధాని హై సెక్యూరిటీ జోన్లోకి ఆగంతకుడు.. అరెస్ట్ చేసిన పోలీసులు‌!

    India Vs New Zealand | రెండో వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 2-0 తేడాతో సిరీస్ కైవసం

    Smith Sabharwal | తెలంగాణ ఐఏఎస్‌ అధికారిణి ఇంట్లోకి అర్థరాత్రి ప్రవేశించిన వ్యక్తి ఎవరు.. దాని గురించి ఆమె ఏమన్నారు!

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Youtube Latest Videos

    Time2News ను మీరు ఫాలో అవండి

    Google News
    28FansLike
    17FollowersFollow
    13FollowersFollow
    500SubscribersSubscribe

    Recent News