Home Latest News India Vs Srilanka | మూడో టీ20లో శ్రీలంకపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం...

India Vs Srilanka | మూడో టీ20లో శ్రీలంకపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా

Image Source: BCCI twitter video

India Vs Srilanka | శ్రీలంకపై 91 పరుగుల తేడాతో మూడో టీ20లో భారత్ భారీ విజయం సాధించింది. టీ20 సిరీస్‌ను కైవసం చేసింది. భారత్ నిర్ధేశించిన 229 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించే క్రమంలో శ్రీలంక చతికిలపడింది. భారత బౌలర్లు విజృంభించడంతో శ్రీలంక 137 పరుగలకు ఆలౌటైంది. దీంతో భారత్ భారీ విజయాన్ని దక్కించుకుంది. భారత్ బౌలర్లలో అర్షద్ సింగ్ మూడు వికెట్లు తీశాడు. చాహాల్ రెండు వికెట్లు, హార్ధిక్ పాండ్యా , అర్షద్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ తలో రెండు వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లకు 228 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ రికార్డు సెంచరీతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. 45 బంతుల్లోనే సూర్యకుమార్ రికార్డు సెంచరీ చేశాడు. మొత్తం మీద ఇన్నింగ్స్ ముగిసే సమయానికి 51 బంతుల్లో 112 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టీ20లో ఇది సూర్యకుమార్‌కు మూడో సెంచరీ. ఇందులో 9 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. భారత్ తరఫున రెండో వేగవంతమైన సెంచరీ ఇదే. ఇక భారత్ తరఫున రెండు వేగవంతమైన సెంచరీలు శ్రీలంకపైనే కావడం విశేషం. గతంలో రోహిత్ శర్మ 35 బంతుల్లో శ్రీలంకపై సెంచరీ చేశాడు.

సూర్యకుమార్‌తో పాటు శుభమన్ గిల్ చెలరేగి ఆడటంతో శ్రీలంక ముందు భారత్ భారీ లక్ష్యాన్ని నిర్ధేశించగలిగింది. నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 228 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ మరోసారి నిరాశ పరిచాడు. ఒక పరుగుకే ఔటయ్యాడు. రాహుల్ త్రిపాఠి 35 పరుగులు, హర్ధిక్ పాండ్యా, దీపక్ హుడా 4, అక్షర్ పటేల్ 21 పరుగులు చేశారు. అక్షర్ పటేల్, సూర్యకుమార్‌ ఇద్దరూ నాటౌట్‌గా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక రెండు వికెట్లు తీశాడు. రజిత, కరుణరత్నే, హసరంగా తలో వికెట్ తీశారు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Viral News | నాకు కేన్సర్ అని అమ్మానాన్నలకు చెప్పొద్దు ప్లీజ్.. డాక్టర్‌ను వేడుకున్న ఆరేళ్ల బాలుడు.. కన్నీరు పెట్టిస్తున్న వైద్యుడి ట్వీట్!

Ayodhya Ram Mandir | అయోధ్య రామ మందిరంలోకి భక్తులను ఎప్పుడు అనుమతిస్తారు ? ఆలయ విశేషాలేంటి.. శిల్పులు ఎవరు ?

Telangana Tourist Places | తెలంగాణలోని ఈ ఆలయంలో 700 ఏళ్లుగా వెలుగుతున్న అఖండజ్యోతి.. గంభీరావుపేటలోనే

Peddagattu lingamanthula jathara | తెలంగాణలో జరిగే రెండో అతిపెద్ద జాతర ఇదే.. పెద్దగట్టు జాతర ప్రత్యేకత ఏంటి ? ఎలా వెళ్లాలి ?

Chitragupta Temple | హైదరాబాద్‌లో మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో చిత్రగుప్తుడి ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

Exit mobile version