Thursday, April 18, 2024
- Advertisment -
HomeLifestyleDo you knowmobiles on plane | విమానం ఎక్కగానే మొబైల్‌ స్విచ్చాఫ్‌ చేయమని ఎందుకు చెబుతారు?

mobiles on plane | విమానం ఎక్కగానే మొబైల్‌ స్విచ్చాఫ్‌ చేయమని ఎందుకు చెబుతారు?

mobiles on plane | సాధారణంగా విమానం ఎక్కిన తర్వాత సెల్‌ఫోన్‌ను ఉపయోగించడానికి అనుమతించరు. ఫ్లైట్‌ టేకాఫ్‌ అవుతుందనగానే మన మొబైల్స్‌ను స్విచ్ఛాప్‌ చేయాలని లేదా ఏరోప్లేన్‌ మోడ్‌లో పెట్టుకోవాలని సూచిస్తుంటారు. ఇలా ఎందుకు చెబుతారని ఎప్పుడైనా ఆలోచించారా? విమానాల్లో ఫోన్లు ఎందుకు ఉపయోగించనివ్వరు? ఎయిర్‌ హోస్టెస్‌ చెప్పిన మాట వినకుండా మొబైల్‌ యూజ్‌ చేస్తే ఏమవుతుంది?

విమానం టేకాఫ్‌, ల్యాండి సమయంలో ప్రయాణికులు మొబైల్‌ను స్విచ్ఛాఫ్‌ చేయమని చెప్పడం వెనుక ఒక కారణం ఉంది. సెల్‌ఫోన్స్‌ అలాగే వివిధ ఎలక్ట్రానిక్‌ పరికరాలు విడుదల చేసే రేడియో తరంగాలే ఇందుకు కారణం. అదెలా అని అనుకుంటున్నారా? విమానం నావిగేషన్‌ కోసం రేడియో తరంగాలను ఉపయోగిస్తారు. స్ట్మార్ట్‌ ఫోన్స్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో కూడా రేడియో తరంగాలను వినియోగిస్తారు. ఈ రెండు కూడా దాదాపు ఒకే ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. కాబట్టి ఫ్లైట్‌ టేకాఫ్‌ లేదా ల్యాండ్‌ అయ్యే సమయంలో మొబైల్‌ ఉపయోగిస్తే.. కాక్‌పిట్‌లో ఉండే ఏరోనాటికల్‌ వ్యవస్థకు అంతరాయం ఏర్పడతాయి. దీనివల్ల సిగ్నల్స్‌ సరిగ్గా అందక ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది.

అందుకే విమాన ప్రయాణం సజావుగా సాగాలంటే టేకాఫ్‌, ల్యాండింగ్‌ సమయాల్లో మొబైల్‌ను స్విచ్ఛాప్‌ లేదా ఏరోప్లేన్‌ మోడ్‌లో పెట్టుకోవాలని సూచిస్తుంటారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Tirumala | తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామికి ఏ రోజు ఏ నైవేద్యం సమర్పిస్తారు?

Tourist places in Goa | ఈ గ్రామం నెల రోజులే కనిపిస్తుంది.. ఆ తర్వాత ఎందుకు కనిపించదు?

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

devotional | పుట్టింటికి వచ్చిన ఆడపిల్ల తొమ్మిదో రోజు అత్తవారింటికి వెళ్లొచ్చా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News