Friday, April 26, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు ( 30-01-2023 )

Horoscope Today | రాశిఫలాలు ( 30-01-2023 )

Horoscope Today | మేషం

మిత్రులతో ఏర్పడిన కలహాలు తీరి ప్రశాంతత పొందుతారు. శ్రమ మీది ఫలితం వేరొకరిదిగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కొన్ని బాకీలు తీరుస్తారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలు చేపడతారు. సంతానం నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ధనలాభ సూచన ఉంది.

వృషభం

దూర ప్రయాణాలు లాభిస్తాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వస్తు లాభ సూచన ఉంది. పారిశ్రామిక, రాజకీయ రంగాల్లో వారికి సన్మాన యోగం. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. సంతాన సమస్యల నుంచి బయటపడతారు.

మిథునం

కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అనుకోని అతిథులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి లాభిస్తుంది. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. సంతానానికి నూతన విద్య అవకాశాలు పొందే సూచన. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

కర్కాటకం

ప్రయాణాలు లాభిస్తాయి. నూతన వ్యాపారాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. సమాజంలో ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.

సింహం

ఎంత శ్రమించినా ఫలితం ఉండదు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆనందాన్ని కలగజేస్తుంది. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. ధనలాభ సూచన ఉంది.

కన్య

నూతన పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సన్నిహితుల సలహాతో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక ప్రగతి సాధిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

తుల

జీవిత భాగస్వామితో ఏర్పడిన విబేధాలు పరిష్కరించుకుంటారు. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. సోదరుల సలహాతో కీలక నిర్ణయం తీసుకుంటారు. సంతానం సమస్యల నుంచి బయటపడతారు. వాహన సౌఖ్యం కలదు.

వృశ్చికం

రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో వారికి సన్మాన యోగం. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభ సూచన. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వార్త సంతోషాన్ని కలగజేస్తుంది. సంతానం నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆహ్వానాలు అందుకుంటారు.

ధనుస్సు

భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. వివాహ, ఉద్యోగ యత్నాలు కలిసివస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. విలువైన ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేస్తారు. సాంకేతిక విద్య అవకాశాలు లభిస్తాయి.

మకరం

ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబసభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన పెట్టుబడులకు అనుకూలమైన సమయం. వాహనాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులను కలుసుకుంటారు.

కుంభం

వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి ధనలాభం పొందుతారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. సంతానంతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. వస్తు లాభ సూచన కలదు.

మీనం

ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు. సోదరుల సలహాతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. క్రయవిక్రయాలు లాభిస్తాయి. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆకస్మిక ధన, వస్తు లాభ సూచన కలదు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

Money in Dreams | కలలో డబ్బులు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News