Friday, April 26, 2024
- Advertisment -
HomeLatest NewsICC Test Rankings | అగ్రస్థానానికి అడుగు దూరంలో అశ్విన్‌.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన...

ICC Test Rankings | అగ్రస్థానానికి అడుగు దూరంలో అశ్విన్‌.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన భారత స్పిన్‌ ద్వయం

ICC Test Rankings | టైమ్‌ 2 న్యూస్‌, దుబాయ్‌: ఆస్ట్రేలియాతో సిరీస్‌లో దుమ్మురేపుతున్న భారత స్పిన్‌ జోడీ.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ హవా కొనసాగించింది. ప్రతిష్ఠాత్మక బోర్డర్‌ గవాస్కర్‌ సిరీస్‌లో తన స్పిన్‌తో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెడుతున్న ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ రెండో ర్యాంక్‌కు చేరగా.. గాయం కారణంగా ఆటకు దూరమై ఆరు నెలల తర్వాత గ్రౌండ్‌లో అడుగుపెట్టిన రవీంద్ర జడేజా.. 9వ ప్లేస్‌కు చేరాడు. చాన్నాళ్లు అగ్రస్థానంలో తిష్ట వేసుకొని కూర్చున్న ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ తాజా సిరీస్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో రెండు స్థానాలు పడిపోయి మూడో ర్యాంక్‌కు చేరాడు. ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌, 40 ఏండ్ల జేమ్స్‌ అండర్సన్‌ టాప్‌ ప్లేస్‌ను అధిష్టించాడు. బౌలర్ల విభాగంతో అశ్విన్‌, జడేజాతో పాటు భారత్‌ నుంచి జస్ప్రీత్‌ బుమ్రాకు కూడా చోటు దక్కింది. గాయం కారణంగా ప్రస్తుతం జట్టుకు దూరమైన ఈ ఏస్‌ పేసర్‌ ఐదో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. న్యూఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో రెచ్చిపోయిన జడేజా రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు సహా మొత్తం 10 వికెట్లు పడగొట్టడంతో ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి టాప్‌-10లో చోటు దక్కించుకోవడం విశేషం. 2019 అనంతరం అతడికిదే అత్యుత్తమ ర్యాంకు.

బ్యాటింగ్‌లో ఇద్దరే..

ఐసీసీ బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మన బౌలర్లు సత్తాచాటగా.. బ్యాటర్లు మాత్రం నిలకడగా తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఘోర రోడ్డు ప్రమాదానికి గురై ప్రస్తుతం కోలుకుంటున్న వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌.. టీమిండియా తరఫున అత్యుత్తమంగా ఆరో స్థానంలో కొనసాగుతుండగా.. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఏడో ర్యాంక్‌లో ఉన్నాడు. మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 16వ ర్యాంక్‌కే పరిమితమయ్యాడు. ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్‌ లబుషేన్‌ టాప్‌ ర్యాంక్‌లో ఉండగా.. స్టీవ్‌ స్మిత్‌, బాబర్‌ ఆజమ్‌, ట్రావిస్‌ హెడ్‌, జో రూట్‌ తొలి ఐదు స్థానాలు దక్కించుకున్నారు.

ఆల్‌రౌండర్ల హవా..

అటు బంతితో పాటు ఇటు బ్యాట్‌తో విజృంభిస్తున్న రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్ల విభాగంలో టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ రెండో ర్యాంక్‌లో ఉండగా.. టాపార్డర్‌ బ్యాటర్ల తరహాలో షాట్లు ఆడుతూ జట్టుకు విజయాలు కట్టబెడుతున్న అక్షర్‌ పటేల్‌ రెండు స్థానాలు ఎగబాకి ఐదో ర్యాంక్‌కు చేరుకున్నాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

WPL 2023 | మహిళల ఐపీఎల్ టైటిల్ హక్కులు కూడా ఆ కంపెనీకే !!.. బీసీసీఐ సెక్రటరీ జై షా కీలక ప్రకటన

US President Elections | అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో మరో భారతీయుడు.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?

Ram Charan | అమెరికాలోనూ అయ్యప్ప మాల.. రామ్ చరణ్ ట్రెండింగ్ గురూ..!

Megastar Chiranjeevi | చిరంజీవి వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడా.. మెగా ప్లాన్ మామూలుగా లేదుగా..!

Dadasaheb Phalke Awards 2023 | దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులు ఎవరెవరికి వచ్చాయి.. లిస్టులో కాంతారా, ఆర్ఆర్ఆర్!

Hansika Motwani | తొందరగా పెద్దగా అవ్వాలని హన్సిక ఇంజెక్షన్లు ఇప్పించుకుందా?

NTR | నందమూరి ఫ్యామిలీకి శాపం తగిలిందా? ఎన్టీఆర్ వారసులంతా సడెన్‌గా చనిపోతున్నారెందుకు?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News