Saturday, April 20, 2024
- Advertisment -
HomeLatest NewsIAS vs IPS | ఫేస్‌బుక్‌లో మహిళా సివిల్ సర్వెంట్స్ గొడవ.. ఇద్దరికీ షాకిచ్చిన కర్ణాటక...

IAS vs IPS | ఫేస్‌బుక్‌లో మహిళా సివిల్ సర్వెంట్స్ గొడవ.. ఇద్దరికీ షాకిచ్చిన కర్ణాటక ప్రభుత్వం

IAS vs IPS | ఒకరు ఐఏఎస్ అధికారి.. మరొకరు ఐపీఎస్ అధికారి.. ఇద్దరూ బాధ్యతయుతమైన సివిల్ సర్వెంట్ హోదాలో ఉన్నారు. కానీ వాళ్లిద్దరూ తమ స్థాయిని మరిచిపోయి దిగజారి ప్రవర్తించారు. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు వ్యక్తిగత ఆరోపణలు చేసుకున్నారు. కర్ణాటకలో ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి, ఐపీఎస్ అధికారి రూప మౌద్గిల్ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఈ వివాదాన్ని కర్ణాటక ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇద్దరిపై బదిలీ వేటు వేసింది. కానీ ఇద్దరికీ ఎలాంటి పోస్టింగ్‌లు ఇవ్వకుండా రిజర్వ్‌లో ఉంచింది.

ప్రస్తుతం ఐఏఎస్‌ అధికారిణి రోహిణి సింధూరి దేవాదాయ శాఖ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తుండగా.. ఆమె స్థానంలో హెచ్.బసవరాజేంద్రన్‌ను కర్ణాటక ప్రభుత్వం నియమించింది. కర్ణాటక హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ రూప స్థానంలో డి. భారతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీఎస్ అధికారి రూప భర్త మునీష్ మౌద్గిల్‌ కూడా ఐఏఎస్ గా ఉన్నారు. ఇద్దరు మహిళా ఉన్నతాధికారుల వివాదం నేపథ్యంలో ఆయనపై కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రచార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఆయన్ను బదిలీ చేసింది. నిన్న వారి ఘర్షణపై హోం మంత్రి సీరియస్ అయ్యారు. ఆ కొద్ది గంటల్లోనే వారి బదిలీ ఉత్తర్వులు వెలుపడటం గమనార్హం.

అసలేమైంది?

మైసూరులో జిల్లా అధికారిగా ఐఏఎస్ రోహిణి పనిచేసినప్పుడు అప్పటి మంత్రి సారా మహేశ్‌ భార్య.. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి భవంతి కడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో మంత్రిపై దర్యాప్తునకు రోహిణి ఆదేశించింది. ఆ తర్వాత అది ప్రభుత్వ స్థలం కాదని.. నిబంధనల మేరకు మంత్రి భార్య బిల్డింగ్ కట్టినట్లు తేలింది. దీంతో తన తప్పును రోహిణి అంగీకరించింది. తాజాగా జనతాదళ్ ఎమ్మెల్యే మహేశ్, మరో ఐఏఎస్ అధికారితో ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన పొటోను ఐపీఎస్ అధికారిణి రూప తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో పాటు రోహిణిపై పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు చేసింది. ఇవే ఫొటోలను ముగ్గురు పురుష ఐఏఎస్ అధికారులకు షేర్ చేసింది. దీనిపై ఐఏఎస్ సింధూరి ఫైర్ అయ్యారు. త‌న‌పై వ్యక్తిగ‌తంగా, రూప త‌ప్పుడు ప్రచారం చేస్తోందని సింధూరి ఆరోపించింది. త‌న వాట్సాప్‌లోని స్క్రీన్‌షాట్లను తీసి, సోష‌ల్ మీడియాలో ఉన్న ఫోటోల‌ను తీసి తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఫోటోలు పెడుతున్నారంటూ ఆమె ఆరోపించింది. వీళ్లిద్దరి వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీరియస్ అయిన కర్ణాటక ప్రభుత్వం ఇద్దరిపై వేటు విధించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Bao missing | మొన్న జాక్‌మా.. నేడు దిగ్గజ బ్యాంకర్ మిస్సింగ్‌.. చైనాలో ఏం జరుగుతోంది?

jackpot | లక్‌ అంటే ఈ అమ్మాయిదే.. అతి చిన్న వయసులోనే 290 కోట్ల జాక్ పాట్!

EPFO | ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ గుడ్ న్యూస్.. అధిక పింఛను కావాలంటే ఇలా అప్లై చేసుకోవాలి!

Hindenburg Research | కుబేరుల జాబితానే తలకిందులు చేసిన అంబులెన్స్‌ డ్రైవర్‌.. గౌతమ్ అదానీ షేర్ల పతనం వెనుక ఆయనే !

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News