Home Latest News Delhi High Court | భార్య నగలపై భర్త ఆశపడటం నేరమే.. ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్య

Delhi High Court | భార్య నగలపై భర్త ఆశపడటం నేరమే.. ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్య

Image Source : Pixabay

Delhi High Court | పెళ్లయినంత మాత్రాన భార్యపై అన్ని హక్కులు ఉన్నట్టు కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. భార్య నగలు ఆమె వ్యక్తిగత ఆస్తి అని పేర్కొంది. భర్త అయినా సరే వాటి మీద ఆశపడటం సరికాదని తెలిపింది. భార్య అనుమతి లేకుండా తప్పేనని స్పష్టం చేసింది. భార్య నగల చోరీ కేసులో మధ్యంతర ఉపశమనం కలిగించాలని భర్త వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ అమిత్ మహాజన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ తిరస్కరించింది.

ఈ కేసులో భార్యను అత్తింటి నుంచి వెళ్లగొట్టడం గానీ.. అపహరించిన నగలను తీసుకెళ్లడం చేయరాదని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ ప్రాథమిక దశలోనే తెలిపింది. విచారణ కోసం అధికారులకు నిందితుడు సహకరించడం లేదని, అపహరించిన నగలను తిరిగి ఇవ్వడం లేదన్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఇటువంటి పరిస్థితుల్లో భర్తకు ముందస్తు బెయిల్ మంజూరు చేయలేమని.. పిటిషన్‌ను రద్దు చేయలేమని స్పష్టం చేసింది.

Follow Us : FacebookTwitter

Read More Articles:

BRS Andhra Pradesh president | బీఆర్‌ఎస్‌ వైపు ఏపీ నాయకుల చూపులు.. ఏపీ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు అయనేనా?

Tamil nadu | ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డీఏ పెంచిన తమిళనాడు సీఎం

Chandrababu | చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట.. ముగ్గురు మహిళల మృతి.. పలువురి పరిస్థితి విషమం

SI, Constable Mains | ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Exit mobile version