Home Latest News Old Pension Scheme | పాత పెన్షన్‌ విధానానికి ప్రభుత్వం ఆమోదం… తొలి క్యాబినెట్ భేటీలోనే...

Old Pension Scheme | పాత పెన్షన్‌ విధానానికి ప్రభుత్వం ఆమోదం… తొలి క్యాబినెట్ భేటీలోనే కీలక నిర్ణయం

Image Source: Wikipedia

Old Pension Scheme | హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి మొదటి క్యాబినెట్‌ సమావేశంలోనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ పాత పెన్షన్‌ విధానానికి ఆమోదం తెలిపింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జాతీయ పెన్షన్‌ విధానం కింద 1.36 లక్షల మంది ఉద్యోగులు, పెన్షన్‌ తీసుకునే వారు ఉన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది.

చెప్పినట్లుగానే గవర్నమెంట్‌ ఏర్పడిన కొద్ది రోజులకే దీన్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచే ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ వెంటనే విడుదల చేస్తున్నట్లు కేబినెట్‌ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి సుఖు ప్రకటించారు.

పాత పెన్షన్‌ విధానాన్ని తాము ఓట్ల కోసం తీసుకురావడం లేదని, ఇది హిమాచల్ ప్రదేశ్‌ ప్రజల హక్కని అన్నారు. దీనితో పాటు రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న అంశం పై కూడా ఆయన స్పందించారు. దీని గురించి కూడా కమిటీ ఏర్పాటు చేస్తున్నామని , ఆ మాట కూడా నిలబెట్టుకుంటామని వివరించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Weather Report | ఈ శతాబ్దంలో ఇదే అత్యంత చలికాలం.. మరో వారంలో మైనస్ 4 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు

Ganga vilas | ప్రధాని మోదీ ప్రారంభించిన గంగా విలాస్ ఎక్కాలంటే 20 లక్షలు ఉండాల్సిందే.. ఈ క్రూయిజ్ స్పెషాలిటీ ఏంటి?

Breaking News | షిర్డీ వెళ్తున్న బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. 10 మంది సాయిబాబా భక్తులు దుర్మరణం

Roja Selvamani | ఆ ఒక్క మాటతో శ్రీకాకుళం జనం జేబులో చేతులు పెట్టుకుని వెళ్లిపోయారు.. పవన్ కళ్యాణ్‌పై రోజా సెటైర్లు

Ambati Rambabu | నేను సంబరాల రాంబాబునైతే నువ్ కల్యాణాల కళ్యాణ్.. పవన్ కళ్యాణ్‌పై అంబటి స్ట్రాంగ్ కౌంటర్

Waltair Veerayya Review | వాల్తేరు వీరయ్య రివ్యూ.. చిరంజీవి, రవితేజ పూనకాలు తెప్పించారా?

Pawan Kalyan | మీ నాన్న వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డినే ఎదుర్కొన్నా.. నువ్వెంత ? ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి పవన్‌ సంచలన వ్యాఖ్యలు

Exit mobile version