Home News AP Heavy Rains | శ్రీశైలం, నాగార్జున సాగర్ కు పోటెత్తిన వరద… గేట్లు ఎత్తిన అధికారులు

Heavy Rains | శ్రీశైలం, నాగార్జున సాగర్ కు పోటెత్తిన వరద… గేట్లు ఎత్తిన అధికారులు

Heavy Rains | భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జూరాల, సుంకేసుల, హంద్రీ నుంచి శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద వస్తుంది. అధికారులు శ్రీశైలం ప్రాజెక్టు 7 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ఇన్ ఫ్లో 1,66,599 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా, ప్రస్తుతం 884 అడుగల వద్ద నీటిమట్టం ఉంది. శ్రీశైలం జలాశయం కుడి, ఎడమ గట్టు విద్యుత్తు కేంద్రాల ద్వారా విద్యుత్తు ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు.

Read More | Fact Check | 5G వ‌చ్చింద‌ని ఇండియాలో 3జీ, 4జీ మొబైల్స్‌ను ఆపేస్తున్నారా?

మరో వైపు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతుంది. సాగర్ లోకి 2,53,240 క్యూసెక్కుల భారీ వరద వస్తుండటంతో 14 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ ఔట్ ఫ్లో 2,52,597 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్త స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 588 అడుగులుగా కొనసాగుతోంది.

Read More | Google Search | గూగుల్‌లో ఈ ప‌దాల‌ను అస్స‌లు సెర్చ్ చేయ‌కండి

మరోవైపు సింగూరు డ్యాంకు 19,613 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో కొనసాగుతోంది. దీంతో రెండు గేట్లు ఎత్తిన అధికారులు 22ల,205 క్యూసెక్కుల నీటిని బయటకు వదిలారు.

Follow Us : FacebookTwitter

Read More | Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Exit mobile version