Saturday, April 27, 2024
- Advertisment -
HomeNewsInternationalFIFA World cup 2022 | నెరవేరిన మెస్సీ కల.. ఫిఫా వరల్డ్ కప్‌ ఫైనల్‌లో...

FIFA World cup 2022 | నెరవేరిన మెస్సీ కల.. ఫిఫా వరల్డ్ కప్‌ ఫైనల్‌లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా విజయం.. విశ్వవిజేతగా అర్జెంటీనా

FIFA World cup 2022 | ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌లో నరాలు తెగే ఉత్కంట. అర్జెంటీనా ( Argentina ), ఫ్రాన్స్ ( France ) మధ్య దోబూచులాడిన విజయం చివరికి అర్జెంటీనానే వరించింది. తాజా విజయంతో అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనిల్ మెస్సి ( lionel Messi ) కల నెరవేరింది. నిర్ణీత సమయం వరకు ఇరు దేశాలు సమంగానే ఉన్నాయి. అదనపు సమయంలోనూ ఇరు దేశాలు చెరోగోల్ చేసి.. 3-3తో సమ ఉజ్జీలుగా నిలిచాయి. అయితే ఫెనాల్టీ షూటౌట్‌‌ను అర్జెంటీనా అందిపుచ్చుకుంది. వరుసగా నాలుగు బంతులను నాలుగు గోల్స్‌గా మలిచి ప్రపంచకప్ ( FIFA World cup winner ) కిరీటాన్ని కైవసం చేసుకుంది.

మ్యాచ్ ఆధ్యంతం నువ్వా నేనా అన్నట్లుగానే సాగింది. 23వ నిమిషంలో పెనాల్టీని మెస్సీ గోల్‌గా మలిచి అర్జెంటీనాకు తొలి గోల్ అందించాడు. ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అటు 36వ నిమిషంలో ఏంజెల్ డీ మారియా మరో గోల్ చేశాడు. దీంతో అర్జెంటీనా 2- 0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అర్జెంటీనా అభిమానుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. కానీ రెండో అర్థభాగం చివరలో అర్జెంటీనాకు ఫ్రాన్స్ ఊహించని షాకిచ్చింది. ఫ్రాన్స్ జట్టు స్టార్ ఆటగాడు ఎంబపే 80, 81వ నిమిషాల్లో వరుసగా రెండు గోల్స్ చేశాడు. దీంతో ఇరు జట్ల మధ్య స్కోరు 2-2తో సమం అయింది.

అభిమానుల్లో ఉత్కంఠ తారా స్థాయికి చేరింది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. నిర్ణీత సమయం ముగిసే సరికి అర్జెంటీనా, ఫ్రాన్స్ చెరో రెండు గోల్స్‌తో సమంగా ఉన్నాయి. దీంతో అదనపు సమయం కేటాయించారు. అయితే అదనపు సమయాన్ని వినియోగించుకున్న అర్జెంటీనా స్టార్ ఆటగాడు మెస్సీ 108 నిమిషం వద్ద గోల్ చేసి ఫ్రాన్స్‌ని వెనక్కి నెట్టాడు. కానీ ఫ్రాన్స్ ఆటగాడు ఎంబాపే ( Kylian Mbappe ) 118 నిమిషాల వద్ద గోల్ చేసి.. స్కోరును 3-3తో సమయం చేశాడు. అదనపు సమయంలోనే ఇద్దరూ సమఉజ్జీలుగా నిలవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది.

ఇక్కడే అర్జెంటీనా దూకుడు ప్రదర్శించి విశ్వవిజేతగా నిలిచింది. పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా వరుసగా నాలుగు బంతుల్లో 4 గోల్స్ చేసింది. కానీ ఫ్రాన్స్ రెండు బంతులనే గోల్స్‌గా మలిచింది. దీంతో మ్యాచ్‌లో అర్జెంటీనా గెలిచి ప్రపంచకప్‌ను ముద్దాడింది. మెస్సీ కల కూడా నెరవేరింది.

గోల్డెన్ బూట్ ( Golden boot ) అవార్డు మిస్

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వరకు అర్జెంటీనా స్టార్ ఆటగాడు, ఫ్రాన్స్ ఆటగాడు ఎంబాపే చెరో ఐదు గోల్స్‌తో సమంగా ఉన్నారు. ఇక ఫైనల్ మ్యాచ్‌లో ఎవరు ఎక్కువ గోల్స్ చేస్తే వారిదే గోల్డెన్ బూట్ ( Golden boot ) అని అందరూ అనుకున్నారు. వీరిద్దరిలో ఎవరికో ఒకరికి గోల్డెన్ బూట్ అవార్డు వస్తుందని అభిమానులు అనుకున్నారు. అందుకు అనుగుణంగానే మ్యాచ్‌లో మెస్సీ ఎంబాపే హోరాహోరీగా తలపడ్డారు. ముందుగా మెస్సీ రెండు గోల్స్ చేశాడు. గోల్డెన్ బూట్ అవార్డు మెస్సీదే అనుకున్నారు. కానీ ఎంబాపే హ్యాట్రిక్ గోల్స్ చేసి గోల్డెన్ బూట్ అవార్డును కైవసం చేసుకున్నాడు.

రికార్డులివే..

ఫిఫా వరల్డ్ కప్‌లో విశ్వవిజేతగా నిలవడం అర్జెంటీనాకు ఇది మూడోసారి..

ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో ఫైనల్‌లో పెనాల్టీ షూటౌట్‌లో ఫలితం తేలడం కూడా ఇది మూడోసారే..

Follow Us : FacebookTwitter

Read More Articles |

Lionel Messi Retirement | ఇదే నా చివరి ప్రపంచ కప్‌.. అర్జెంటీనా స్టార్‌ మెస్సీ సంచలన ప్రకటన

Sania – shoaib malik divorce rumours | సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడిపోవడానికి ఆమే కారణమా? షోయబ్ తాజా వ్యాఖ్యల వెనుక అర్థమేంటి?

Arjun Tendulkar | తండ్రికి తగ్గ తనయుడు.. రంజీ అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ కొట్టిన అర్జున్‌ టెండూల్కర్‌

ODI world cup | 2023లో జరగనున్న వన్డే ప్రపంచకప్ టోర్నీ భారత్ నుంచి తరలిపోనుందా.. కారణమిదేనా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News