Friday, March 29, 2024
- Advertisment -
HomeLifestyleHealthTips to sleep | బోర్లా పడుకుంటే ప్రమాదమా.. ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్టేనా ? వైద్యులు...

Tips to sleep | బోర్లా పడుకుంటే ప్రమాదమా.. ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్టేనా ? వైద్యులు ఏం చెబుతున్నారు?

Tips to sleep | చాలా మందికి బోర్లా పడుకుని నిద్రపోయే అలవాటు ఉంటోంది. అలా అయితేనే నిద్రపడుతుంది లేదంటే ప్రశాంతంగా కంటినిండా నిద్ర ఉండదు అనుకునేవారు చాలామందే ఉంటారు. కానీ ఇలా పొట్టవైపునకు తిరిగి పడుకోవడం చాలా ప్రమాదమని అంటున్నారు. దాని వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఎంటా ప్రమాదం.. దానికి కారణాలు ఏంటి?

గతంలో చేసిన సర్వే ప్రకారం… వందలో 74 శాతం మంది ఏదో ఒక వైపునకు తిరిగి పడుకుంటారు. 16శాతం మంది మాత్రమే బోర్లా పడుకునే నిద్రపోతారట. అయితే బోర్లా పడుకోవడం హాయిగా అనిపించినప్పటికీ.. అది అత్యంత ప్రమాద కరమైన నిద్రా భంగిమ అంటున్నారు నిపుణులు.

Read more: Health tips | రాత్రిపూట అన్నానికి బదులు చపాతీలు తినొచ్చా.. తింటే ఏమైనా ఉపయోగం ఉంటుందా?

బోర్లా పడుకోవడం అంటే పొట్ట మీద భారం వేసి పడుకుంటున్నాం అన్నమాట. దీని వల్ల పలు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయట. ఇలా చేయడం మంచిది కాదని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయని స్లీపింగ్ ఓషియన్ వ్యవస్థాపకుడు, స్లీప్ సైన్స్ కోచ్ అలెక్స్ సేవీ అంటున్నారు.

ప్రముఖ న్యూరాలజిస్ట్, స్లీప్ స్పెషలిస్ట్, వైద్య సలహాదారులు పీట్రో ల్యూకా రట్టీ చెప్పినదాని ప్రకారం.. బోర్లా పడుకునే అలవాటు ఉన్నవారు మొదట్లో చిన్న చిన్న నొప్పులతో బాధపడినప్పటికీ.. తర్వాత పెద్ద ఇబ్బందులే ఎదుర్కోవాల్సి వస్తుందట. పొట్టవైపునకు తిరిగి పడుకోవడం వల్ల మనం మన వెన్నుముక, మెడ, పిరుదులు, తల, ఊపిరితిత్తులతో పాటు హృదయాన్ని కూడా ప్రమాదంలో పెడుతున్నామట. అదెలా అంటే…

మనం బోర్లా నిద్రపోతున్నప్పుడు వెన్నుముక తన సహజ వక్రత(నేచురల్ కర్వ్)ను కోల్పోతుందట. దీని వల్ల ఒత్తిడి పెరిగి వెన్నుముక అధిక శ్రమకు గురవుతుందట. వెనుక కండరాలు కూడా దెబ్బతిని ఉదయాన్నే వెన్నునొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయట. పొట్టవైపుకు తిరిగి పడుకోవడం వల్ల హైపర్లార్డాసిస్ వంటివి మొదలై వెన్ను చివర్లో నొప్పులు మొదలవుతాయట. కటి వెన్నుముక వంగి.. వెన్నుముక కింద భాగంలో ఒత్తిడి పెరిగుతుంది. ఇది ముందు ముందు స్పైనల్ స్టెనోసిస్(వెన్నుముక నాళము ముడుచుకుపోవడం వల్ల వచ్చే సమస్యలు), స్పాండిలోసిస్ కు దారి తీస్తుందని ఫిజియో థెరపిస్ట్ క్రిస్టెన్ గ్యాస్నిక్ చెబుతున్నారు.

Read more: Health tips | పరిగడుపున లెమన్‌ వాటర్‌ తాగితే ఏమౌతుంది.. అసలు చలికాలంలో లెమన్‌ వాటర్‌ తాగొచ్చా?

పొట్టవైపుకు తిరిగి పడుకున్నప్పుడు మనం ఊపిరి తీసుకోవాడానికి మెడను ఏదో ఒకవైపుకు తిప్పి ఉంచుతాం. దీని వల్ల మన మెడ వెన్నుముక మధ్య సంబంధాలు చెడిపోతాయట. మెడ ఒకపక్కకు తిప్పి ఉంచడం వల్ల ఒకవైపు గట్టిపడి.. మరో వైపె బలహీనమవుతుందట. దీని వల్ల మెడ పట్టుకోవడం.. మెడ నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయట.

మెడ, నడుం నొప్పిలతో పాటు బోర్లా పడుకోవడం వల్ల.. నడుంని వెనక్కి తిప్పి ఉంచుతాం కాబట్టి, లాంబర్డో పాయింట్ మీద వెయిట్ పడుతుంది. ఫలితంగా వెన్ను చివరి భాగంలో వంపుపై భారం పడి నొప్పి పెరుగుతుంది. ఫలితంగా మున్ముందు డిస్క్ సమస్యలు కూడా రావొచ్చు. బోర్లా పడుకున్నప్పుడు వచ్చే సమస్యల్లో హెర్నియా డిస్క్ సమస్య మరొకటి. వెన్నెముకలో పగుళ్లు ఏర్పడి జిగురు తగ్గిపోవచ్చు. డిస్క్ నుంచి జెల్ బయటకు వచ్చేసిన తర్వాత ఇరిటేషన్ తో పాటు నరాల బలహీనత సమస్య కూడా వస్తుంది. వీటితో పాటు.. పొట్టవైపుకు తిరిగి పడుకున్నప్పుడు కండరాలు బిగబట్టి ఉంచుతాం కాబట్టి మెడ, భుజంతో పాటు తల నొప్పి కూడా వస్తోందట. కాబట్టి వీలైనంత వరకూ బోర్లా పడుకువడం తగ్గించుకునే ప్రయత్నం చేయండి.

Read more: Birth Defects | గర్భంలో ఉన్న శిశువులో లోపాలను ముందే గుర్తించడం ఎలా.. ఈ పరీక్షలు చేపిస్తే తెలిసిపోతుంది

ప్రమాదాన్ని ఎలా నివారించొచ్చు

బోర్లా పడుకునే అలవాటు మానుకోలేని వారు ఈ ప్రమాదాల నుంచి తప్పించుకునేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయట. పొట్టవైపుకు తిరిగి పడుకునే ముందు తల, మెడ భాగాలపై ఒత్తిడి పడకుండా ఉండేలా ఓ దిండును ఏర్పరుచుకోవాలి. కాళ్ల కింద కూడా ఓ దిండు ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెన్నుముక సమస్యలు రాకుండా ఉంటాయట. దీంతో పాటు వెన్నుముక కింద భాగంలో కూడా పిల్లో ఉంచుకోవడం మంచిదట. వైద్య నిపుణులు ఇస్తున్న మరో సలహా ఏంటంటే.. రాత్రంతా తలను ఒకే వైపుకు కాకుండా అటు, ఇటు తిప్పడం మంచిదట.

Follow Us : FacebookTwitter

Read more articles | Health tips for heart | గుండె పదిలంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. డిప్రెషన్ గా అనిపిస్తే వెంటనే ఇలా చేయండి!

Fact Check | 5G వ‌చ్చింద‌ని ఇండియాలో 3జీ, 4జీ మొబైల్స్‌ను ఆపేస్తున్నారా?

Whatsapp Tricks | ఫోన్ నంబ‌ర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్‌లో మెసేజ్ ఇలా పంపించండి

Google Search | గూగుల్‌లో ఈ ప‌దాల‌ను స్స‌లు సెర్చ్ చేయ‌కండి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News