Home Latest News QR Code for LPG gas Cylinder | ఇకపై గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్.....

QR Code for LPG gas Cylinder | ఇకపై గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్.. ఎందుకో తెలుసా

QR Code for LPG gas Cylinder | గ్యాస్ సిలిండర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్ ట్యాగ్‌లను తగిలించనున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ ప్రకటించారు. గ్యాస్ అక్రమాలను నియంత్రించడంతో పాటు, గ్యాస్ సిలిండర్ల దొంగతనాలకు అడ్డుకట్ట వేయడంలో భాగంగా ఈ క్యూఆర్ కోర్డు విధానాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. ఇది గ్యాస్ సిలిండర్‌కు ఆధార్ కార్డులా పనిచేస్తుందని తెలిపారు. మొదటి విడతలో 20 వేల ఎల్‌పీజీ సిలిండర్లకు క్యూఆర్ కోడ్ తగిలించారు. వచ్చే మూడు నెలల్లో అన్ని డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్ తీసుకొస్తామని కేంద్రమంత్రి పేర్కొన్నారు.

క్యూఆర్ కోడ్ వల్ల లాభమేంటి?

క్యూఆర్ కోడ్‌ను స్మార్ట్ ఫోన్‌తో స్కాన్ చేయగానే గ్యాస్ సిలిండర్‌కు సంబంధించిన అన్ని వివరాలు కనిపిస్తాయి. సిలిండర్ ఏ డీలర్ నుంచి వచ్చింది? ఎప్పుడు ఫిల్ అయ్యింది? దాని డెలివరీ బాయ్ ఎవరు అనే ప్రతి ఒక్క సమాచారాన్ని కస్టమర్లు తెలుసుకోవచ్చు. గ్యాస్ ఫిల్లింగ్ ప్లాంట్ నుంచి కస్టమర్ల ఇంటికి చేరేవరకు మొత్తం ప్రయాణాన్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. గ్యాస్ సిలిండర్ బరువు, గడువు తేదీ వంటి విషయాలు కూడా చూడవచ్చు.

Read More :

Tips to sleep | బోర్లా పడుకుంటే ప్రమాదమా.. ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్టేనా ? వైద్యులు ఏం చెబుతున్నారు?

Health tips for heart | గుండె పదిలంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. డిప్రెషన్ గా అనిపిస్తే వెంటనే ఇలా చేయండి!

Exit mobile version