Home Latest News Corona Alert | బిహార్‌లో నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్.. అప్రమత్తమైన అధికారులు

Corona Alert | బిహార్‌లో నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్.. అప్రమత్తమైన అధికారులు

Corona Alert | చైనా సహా పలు దేశాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే లక్షల్లో రోజూవారీ కేసులు నమోదవుతున్నాయి. ఇటు భారత్‌లోనూ భయాందోళనలు మొదలయ్యాయి. దీంతో విమానాశ్రయాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. అంతర్జాతీయ ప్రయాణికులకు ర్యాండమ్‌గా కరోనా పరీక్షలు చేస్తున్నారు. తాజాగా బిహార్‌లో నలుగురు విదేశీయులకు కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

గయా విమానాశ్రయంలో నిర్వహించిన RTPCR పరీక్షల్లో నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వారిలో ముగ్గురిని గయాలోని ఐసోలేషన్‌లో ఉంచగా.. మరొకరు అప్పటికే ఢిల్లీ వెళ్లిపోయారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అతన్ని గుర్తించే పనిలో పడ్డారు. బౌద్ధ గురువు దలైలామా నెల రోజుల పాటు బోధ్‌‌గయలో ఉండనున్నారు. ఈ నేపథ్యంలో దలైలామాను కలిసేందుకు పెద్ద ఎత్తున విదేశాల నుంచి భక్తులు అక్కడి వస్తున్నారు. అందుకే ముందస్తు చర్యల్లో భాగంగా గయ విమానాశ్రయం, రైల్వేస్టేషన్‌లో కరోనా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలోనే జలుబు, దగ్గుతో బాధపడుతున్న 33 మందికి ఆదివారం పరీక్షలు చేయగా.. నలుగురికి పాజిటివ్ వచ్చింది. ఆ నలుగురు ఇంగ్లాండ్, మయన్మార్ దేశస్థులని అధికారులు వెల్లడించారు. మరోవైపు చైనా నుంచి బెంగళూరు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతన్ని వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్‌లో ఉంచారు. జీనోమ్ సీక్వెన్సింగ్‌ కోసం శాంపిల్స్ పంపారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Shocking Incident | స్నేహితులతో కలిసి మద్యం తాగుతుండగా లాక్కెల్లిన పులి.. సగం తిని వదిలేసింది

Cherial zptc | సిద్దిపేట జిల్లా చేర్యాల జడ్పీటీసీపై కత్తులతో దాడి.. వాకింగ్‌కు వెళ్లొస్తుండగా ఘటన

Kerala | ఇద్దరి యువకుల ఖాతాలో పొరపాటున రూ.2.44 కోట్ల పడితే.. ఏం చేశారో తెలుసా.. బ్యాంకు వాళ్లే షాకయ్యారు!

Cordyceps | భారత్‌లోకి చైనా సైన్యం చొరబడేది ఆ బంగారం కోసమేనట.. తాజా నివేదికలో సంచలన విషయాలు

Avatar 2 ott release date | అవతార్‌2 ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనంట.. వైరల్‌గా మారిన రిలీజ్‌ డేట్‌

Exit mobile version