Home News AP Rains | తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. మరో 3 రోజులు భారీ వర్షాలు

Rains | తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. మరో 3 రోజులు భారీ వర్షాలు

Rains | తెలుగు రాష్ట్రాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటికే చేతికొచ్చిన పంటలు చాలావరకు నీటమునిగాయి. ఇదిలా ఉంటే ఇప్పుడే ఈ వర్షాలు తగ్గే అవకాశం కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది.

పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడా, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి అనిశ్చితి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా తెలంగాణలో మంగళవారం ఉదయం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, వడగళ్లతో భారీ వానలు పడే అవకాశం ఉంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Exit mobile version