Thursday, June 13, 2024
- Advertisment -
HomeLatest NewsCorona cases | కరోనా కల్లోలంపై తొలిసారి అధికారికంగా స్పందించిన చైనా.. అవన్నీ తప్పుడు నివేదికలే!

Corona cases | కరోనా కల్లోలంపై తొలిసారి అధికారికంగా స్పందించిన చైనా.. అవన్నీ తప్పుడు నివేదికలే!

Corona cases | చైనాలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నా ఇన్నాళ్లు ఆ దేశం స్పందించలేదు. ఇప్పుడు తొలిసారిగా కరోనా పరిస్థితిపై అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఓవైపు చైనాలో రోజుకు కోట్లలో కరోనా కేసులు నమోదవుతున్నాయని, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయని, శ్శశానవాటిక వద్ద మృతదేహాల క్యూ ఉంటుందని, ఆస్పత్రులు కూడా చేతులెత్తేస్తున్నాయని అంతర్జాతీయ స్థాయిలో నిపుణులు చెబుతున్నారు. ఇదే విషయం పలు నివేదికల్లోనూ వెల్లడైంది. కానీ అలాంటి పరిస్థితి లేదని చైనా కొట్టిపారేసింది. వాస్తవ పరిస్థితిని వక్రీకరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల ప్రాణాలు రక్షించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని వెల్లడించింది.

చైనాలో కరోనాతో ఇబ్బంది పడుతున్న ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అన్ని రకాల సదుపాయాలను అందుబాటులో ఉంచామని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. దశల వారీగా చైనాలో కేసులు పెరుగుతున్నాయని అయినా కరోనాను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. శాస్త్రీయ పద్ధతుల ద్వారా కరోనా కట్టడికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. విదేశాల నుంచి చైనాకు వచ్చే ప్రయాణికులకు జనవరి 8 నుంచి క్వారంటైన్ నిబంధనలను కూడా ఎత్తివేస్తున్నట్లు చైనా ప్రకటించింది. కరోనా ఇన్ఫెక్షన్ స్థాయిని క్లాస్ ఏ నుంచి క్లాస్ బీ కి తగ్గిస్తున్నట్లు చైనా జాతీయ హెల్త్ మిషన్ ప్రకటించింది. కరోనా బాధితులతో సన్నిహితంగా మెలిగే వారికి ఇప్పటివరకు క్వారంటైన్ కంపల్సరి ఉండేది. కానీ ఇకపై ఆ నిబంధనను ఎత్తేసింది. దాంతో పాటు కరోనా కేసులు భారీగా ఉన్న ప్రాంతంలో లాక్‌డౌన్ నిబంధనలను ఎత్తేసింది.

మరోవైపు చైనాలో కరోనా కల్లోలం చూసి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. చైనా నుంచి తమ దేశాలకు కరోనా వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ఆ జాబితాలో ఇటలీ, జపాన్, తైవాన్ దేశాలు కూడా చేరాయి. తాజాగా అమెరికా కూడా చైనా ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ఆర్టీపీసీఆర్ నెగెటీవ్ సర్టిఫికెట్ కంపల్సరి చేసింది. జనవరి 5 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Rahul Gandhi | అలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి అయితే ఓకే.. పెళ్లిపై రాహుల్ గాంధీ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు

Vallabhaneni Janardhan | టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత

Gadwal Vijayalaxmi | భూ వివాదంలో హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి.. ఇదే భూమి విషయంలో 2007లో కే.కేశవరావు కుమారుడి ఇంట్లో రియల్టర్ హత్య

Pragna Reddy | పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కోడలికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అండ..

Pavel Antov | రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను వ్యతిరేకించే ఎంపీ ఒడిశాలో ఎందుకు చనిపోయారు.. ఏమైనా కుట్ర కోణం ఉందా?

Secunderabad Club | జూబ్లీ బస్టాండ్‌ దగ్గరున్న సికింద్రాబాద్‌ క్లబ్‌ గురించి ఈ విషయాలు తెలుసా.. 20 ఏళ్లు నిరీక్షించినా సభ్యత్వం కష్టమే!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News