Thursday, March 28, 2024
- Advertisment -
HomeEntertainmentVallabhaneni Janardhan | టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత

Vallabhaneni Janardhan | టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత

Vallabhaneni Janardhan | టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు వల్లభనేని జనార్ధన్ ( 63 ) కన్నుమూశారు. అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చేరిన జనార్ధన్ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇటీవలే కైకాల సత్యనారాయణ, చలపతిరావు మృతి చెందారు. ఇప్పుడు మరో నటుడి మృతితో టాలీవుడ్‌లో విషాదచాయలు అలుముకున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు సమీపంలోని పోతునూరులో వల్లభనేని జనార్ధన్ 1959 సెప్టెంబర్ 25న జన్మించారు. విజయవాడ లయోలా కాలేజీ చదువుకున్న జనార్ధన్.. చిన్నతనంలోనే సినిమాలపై మక్కువ పెంచుకున్నాడు. సొంతసంస్థను స్థాపించి మామ్మగారి మనవలు పేరుతో సినిమా మొదలుపెట్టారు. అయితే అది మధ్యలోనే ఆగిపోవడంతో 21 ఏళ్ల వయసులో దర్శకుడిగా మారారు. కన్నడ హిట్ సినిమా మానస సరోవర్ ఆధారంగా చంద్రమోహన్ హీరోగా అమాయక చక్రవర్తి సినిమాకు జనార్ధన్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత శోభన్‌బాబు హీరోగా తోడు నీడ తీశారు. తన కుమార్తె శ్వేత పేరుతో సంస్థను స్థాపించి శ్రీమతి కావాలి, పారిపోయిన ఖైదీలు చిత్రాలను రూపొందించారు. శ్రీమతి కావాలి సినిమాకు తాను అనుకున్న ఆర్టిస్ట్ రాకపోవడంతో తొలిసారి ముఖానికి రంగేసుకున్నారు. నటుడిగా మారారు. ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల మొదటి సినిమా నీ కోసం సినిమాకు కూడా జనార్ధనే నిర్మాత.

విజయబాపినీడు దర్శకత్వంలో రూపొందిన అనేక చిత్రాల్లో వల్లభనేని జనార్ధన్ నటించారు. చిరంజీవితో కలిసి బాపినీడు తెరకెక్కించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో సుమలత తండ్రి పాత్రలో వల్లభనేని నటన అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా నటుడిగా అవకాశాలు వచ్చాయి. దాదాపు వందకు పైగా చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగర్జున, వెంకటేశ్ లాంటి హీరోల సినిమాల్లో విలన్‌గా నటించి మెప్పించారు.

ప్రముఖ దర్శకుడు, నిర్మాత విజయబాపినీడు కూతురును జనార్ధన్ వివాహం చేసుకున్నారు. జనార్ధన్‌కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. చిన్న కూతురు శ్వేత చిన్నతనంలోనే చనిపోయింది. మరో కూతురు ఫ్యాషన్ డిజైనర్ కాగా, అబ్బాయి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Tollywood 2022 | కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సహా 2022లో మరణించిన సెలబ్రెటీలు వీళ్లే.

chalapathi rao | చలపతిరావు జీవితంలో సినిమాటిక్ లవ్ స్టోరీ.. అమ్మాయిని చూసిన వారం రోజుల్లోనే పెళ్లి

chalapathi rao | మంటల్లో కాలి భార్య మరణం.. 8 నెలలు చక్రాల కుర్చీలోనే.. చలపతిరావు జీవితంలో విషాదాలెన్నో

chalapathi rao | చలపతిరావు అంటే హీరోయిన్స్‌కు భయం.. ఆయన ఉన్న హోటల్‌కు అస్సలు వెళ్లేవాళ్లు కాదు

Kaikala Satyanarayana | చిరంజీవిని కైకాల సత్యనారాయణ కోరిన చివరి కోరిక అదే.. ఎమోషన్ అయిన మెగాస్టార్

Kaikala Satyanarayana | కేజీఎఫ్ సినిమా సక్సెస్ అయితే కైకాలకు ఎందుకు సన్మానం చేశారు?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News