Home Latest News KGF mines | కేజీఎఫ్‌ గనుల్లో ఇంకా 25 టన్నుల బంగారం.. వెలికితీసేందుకు బిడ్లు ఆహ్వానించబోతున్న...

KGF mines | కేజీఎఫ్‌ గనుల్లో ఇంకా 25 టన్నుల బంగారం.. వెలికితీసేందుకు బిడ్లు ఆహ్వానించబోతున్న కేంద్ర ప్రభుత్వం!

KGF mines | కేజీఎఫ్‌ పేరు వినగానే కన్నడ నటుడు యశ్‌ నటించిని సినిమానే గుర్తొస్తుంది కదూ. ఆ సినిమా స్టోరీ అంతా బంగారం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. బంగారాన్ని వెలికి తీయడం.. స్మగ్లింగ్‌ చేయడం గురించే కథంతా. అయితే సినిమాలో చూపించినదంతా నిజం కాదు. కానీ కేజీఎఫ్‌ ( KGF ) పేరుతో కర్ణాటకలో నిజంగానే బంగారు గనులు ఉన్నాయి. అవే కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ ( Kolar gold fields ). వేల కిలోల బంగారాన్ని ఈ గనుల నుంచి వెలికితీశారు. ఇప్పుడా గనుల తలుపులను 20 ఏళ్ల క్రితమే మూసేశారు. ఇప్పుడా తలుపులు మళ్లీ తెరుచుకుకోబోతున్నాయట. కేంద్రం ఆ తలపులను తెరిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందట. కేజీఎఫ్‌తో సంబంధం ఉన్న ఓ అధికారే ఈ విషయం వెల్లడించాని సమాచారం.

బెంగళూరుకు 65 కిలోమీటర్ల దూరంలో KGF mines

కర్ణాటక రాజధాని బెంగళూరుకు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేజీఎఫ్‌ ( KGF ) ఉంది. 20 ఏళ్ల క్రితం మూసిన ఆ గనుల తలుపులను కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తెరవాలని చూస్తోంది. అక్కడే ఉన్న 50 మిలియన్‌ టన్నుల శుధ్ది చేసిన ఖనిజం నుంచి బంగారాన్ని వెలికితీసేందుకు బిడ్లను ఆహ్వానించాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ గనులతో ప్రత్యక్ష సంబంధం ఉన్న ఒక అధికారి ఈ విషయాలను వెల్లడించారు. కేజీఎఫ్‌లో 2.1 బిలియన్‌ డాలర్ల విలువైన బంగారు నిక్షేపాలు ఉన్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

పల్లాడియంను కూడా..

గతంలో శుద్ధి చేసిన ఖనిజం నుంచి ఇప్పుడు బంగారం వెలికి తీయనున్నారు. విదేశాల్లో ఉన్న సాంకేతికను ఉపయోగించి బంగారాన్ని వెలికితీయనున్నారు. కేవలం బంగారమే కాదు.. పల్లాడియంను కూడా వెలికి తీయనున్నారు. అయితే శుద్ధి చేసిన ఖనిజంలోని బంగారు నిల్వలను ఎలా గుర్తించాలి.. ఎలా వెలికితీయాలి అనేదానిపై ఇప్పుడు దృష్టి పెట్టినట్లు సదురు అధికారి తెలిపారు.

కేజీఎఫ్‌ చుట్టూ 13 గుట్టలు..

రాబోయే నాలుగైదు నెలల్లో బిడ్లు ఆహ్వానించాలని కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని ఆ అధికారి అన్నారు. అయితే శుద్ధి చేసిన ఖనిజంలో నుంచి బంగారాన్ని వెలికితీసే సాంకేతికత విదేశాల్లోనే ఉందన్న ఆయన.. విదేశీ కంపెనీలు స్థానిక కంపెనీలతో ఒప్పందం చేసుకుని, లేని పక్షంలో కన్సార్టియం ఏర్పాటు చేసుకుని బంగారాన్ని వెలికితీసేందుకు బిడ్‌ దాఖలు చేయొచ్చునని వెల్లడించారు. గతంలో కేజీఎఫ్‌ గనుల లోపలి నుంచి బయటకు తెచ్చిన మట్టిలో బంగారాన్ని సేకరించారు. ఆ తర్వాత మట్టినంతా గుట్టలుగా పోశారు. ఇలా పోసినదే కేజీఎఫ్‌ చుట్టు దాదాపు 13 గుట్టలు ఉన్నాయి. వీటి నుంచి బంగారాన్ని వెలికితీసేందుకు కేంద్రం బిడ్లను ఆహ్వానిస్తోంది.

బయటపడనున్న 25 టన్నుల బంగారం

50 మిలియన్‌ టన్నుల మట్టిని ఇప్పటికే నిపుణులు పరిశోధించారు. ఇక్కడి మట్టిలో 25 టన్నుల బంగారం సేకరించవచ్చని అంచనా వేశారు. సో.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సినిమాలో చూపించినట్లుగానే కేజీఎఫ్‌ నుంచి బంగారం బయటపడబోతుందన్నమాట.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Swap village | ఆరు నెలలకు ఒకసారి దేశం మారే దీవి.. ఈ వింత మీకు తెలుసా !!

Roanoke mystery | ఊరుకు ఊరే మాయమైంది.. అక్కడి జనం ఏమైపోయారో ఇప్పటికీ మిస్టరీనే !!

Most dangerous snake | ప్రపంచంలోనే మోస్ట్‌ డేంజరస్‌ పాము.. ఇది కాటేస్తే 100 మంది బలికావాల్సిందే

Exit mobile version