Friday, March 29, 2024
- Advertisment -
HomeLatest NewsSarfaraz khan | సర్పరాజ్‌ను జట్టులోకి ఎంపిక చేయకపోవడానికి కారణం ఇదే.. నోరువిప్పిన బీసీసీఐ

Sarfaraz khan | సర్పరాజ్‌ను జట్టులోకి ఎంపిక చేయకపోవడానికి కారణం ఇదే.. నోరువిప్పిన బీసీసీఐ

Sarfaraz khan | దేవుడు కరుణించిన పూజారి వరమివ్వడు అన్నట్లు… టీమ్‌ లోకి రావడానికి మూడు సంవత్సరాలుగా పరుగుల వరద పారిస్తున్నప్పటికీ సెలక్టర్లు మాత్రం సర్ఫరాజ్‌ ఖాన్‌ను కరుణించడం లేదు. తాజాగా ఆస్ట్రేలియా సిరీస్‌ కోసం తనను ఎంపిక చేయకపోవడం పై బహిరంగంగానే విమర్శలుచేశాడు. ఆఖరికి మాజీ క్రికెటర్లు కూడా సర్పరాజ్‌‌ను సెలక్షన్‌ కమిటీ విస్మరించడం పై ఆశ్చర్యం వ్యక్తంచేశారు. వీటిని అన్నింటిని చూసిన సెలక్షన్‌ కమిటీలోని ఒకరైన శ్రీధరన్‌ శరత్‌ స్పందించాడు.

సర్పరాజ్‌ ను ఎందుకు ఎంపిక చేయలేదు అనే దాని మీద వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ” మా అందరి దృష్టిలో సర్పరాజ్‌ ఉన్నాడు. సరైన సమయంలోనే అతనికి జట్టులో అవకాశం దక్కుతుంది. అయితే ఓ జట్టును ఎంపిక చేసే సమయంలో మేము కూర్పు సమతుల్యతను దృష్టిలో ఉంచుకోవాల్సి వస్తుంది ” అని శ్రీధరన్‌ చెప్పాడు.

అంతేకాకుండా సర్పరాజ్‌ కంటే ముందుగా సూర్యకుమార్‌‌ను ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందో కూడా వివరించాడు. సూర్య కుమార్‌ యాదవ్‌ కూడా ప్రత్యర్థి నుంచి చాలా వేగంగా మ్యాచ్‌‌ను దూరం చేయగలడు. బౌలర్లను దెబ్బ తీసే షాట్లు చాలా ఉన్నాయి. అంతే కాకుండా ఫస్ట్‌ క్లాస్‌లో అతడు 5 వేలకు పైగా పరుగులు చేశాడన్న విషయాన్ని మరచిపోవద్దు అని శరత్‌ అన్నాడు.

మరో వైపు సర్పరాజ్‌ ప్రస్తుత రంజీ సీజన్లో ముంబై తరుఫున ఇప్పటికే మూడు సెంచరీలు బాదాడు. హైదరాబాద్‌, తమిళనాడు, ఢిల్లీలతో జరిగిన మ్యాచ్‌ లలో సర్పరాజ్‌ సెంచరీలు చేశాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Kodali Nani | నందమూరి వారసులకు భయపడే నారా లోకేశ్ పాదయాత్ర.. యువగళంపై కొడాలి నాని కౌంటర్

Pawan Kalyan | పవన్ కళ్యాణ్‌కు.. కేఏ పాల్‌కు పెద్ద తేడా లేదు.. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్

Vishnu Priya | యాంకర్ విష్ణు ప్రియ ఇంట విషాదం.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు

TTD | అరచేతిలో వైకుంఠనాథుడి విశేషాలు.. మొబైల్‌లో ఒక్క క్లిక్‌తోనే శ్రీవారి దర్శనం టికెట్లు, రూమ్స్ అన్నీ బుక్ చేసుకోవచ్చు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News