Saturday, April 27, 2024
- Advertisment -
HomeLatest NewsBandi Sanjay | ధరణిని రద్దు చేయం.. కేసీఆర్ పథకాలను అలాగే కొనసాగిస్తాం.. రూట్ మార్చేసిన...

Bandi Sanjay | ధరణిని రద్దు చేయం.. కేసీఆర్ పథకాలను అలాగే కొనసాగిస్తాం.. రూట్ మార్చేసిన బండి సంజయ్

Bandi Sanjay | తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను అలాగే కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ధరణిని కూడా కొనసాగిస్తామని.. కాకపోతే సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్ పాలనను విమర్శించిన బండి సంజయ్.. ఇప్పుడు అవే పథకాలను కంటిన్యూ చేస్తామనడం పొలిటికల్‌గా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కేసీఆర్ పథకాలు అమలు చేస్తానని అంటూనే ఆయనపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ సంయుక్త మోర్చా సమావేశంలో కేంద్రమంత్రి ప్రకాశ్ జావదేకర్‌తో కలలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. మోదీ పేరు చెబితేనే కేసీఆర్ గజగజ వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే కాంగ్రెస్‌తో కలిసి కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. ఆ డ్రామాల్లో భాగంగానే మోదీ తనకు మంచి మిత్రుడని కేసీఆర్ జిమ్మిక్కులు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ సర్వనాశనమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే తెలంగాణ అభివ‌ృద్ది సాధ్యమని స్పష్టం చేశారు. ఈ నెల 22న ఇంటింటికీ బీజేపీ నేరుతో జనంలోకి వెళ్తామని తెలిపారు. 2024 ఎన్నికల్లో 14 ఎంపీ సీట్లు బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఏ సర్వేలు చూసినా బీజేపీకి అనుకూలమనే చెబుతున్నాయని అన్నారు. కేసీఆర్ సర్వేలో కూడా ఇదే వెల్లడైందని తెలిపారు.

బీఆర్‌ఎస్‌కు జిల్లా అధ్యక్షులు లేరని.. బూత్ కమిటీలు లేవని బండి సంజయ్ అన్నారు. అదే బీజేపీకి జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ కన్వీనర్లు ఉన్నారని.. మండల కమిటీలు, బూత్ కమిటీలు ఉన్నాయని స్పష్టం చేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pawan Kalyan | నా చెప్పులు నాకు ఇప్పించండి ప్లీజ్‌.. పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ కౌంటర్‌

Adipurush | ఆదిపురుష్ సినిమా చూసేందుకు వచ్చిన హనుమంతుడు.. జై శ్రీరామ్ అంటూ మార్మోగిన సినిమా హాల్

Weather Updates | బిపర్‌జాయ్ ఎఫెక్ట్.. తెలంగాణలో వర్షాలు బంద్.. జూన్ చివరిదాకా ఎండలే !

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News