Saturday, April 27, 2024
- Advertisment -
HomeEntertainmentTamannah Bhatia | 30 ఏళ్లలోపే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కనాలని అనుకున్నా.. తమన్నా...

Tamannah Bhatia | 30 ఏళ్లలోపే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కనాలని అనుకున్నా.. తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Tamannah Bhatia | ఎట్టకేలకు తమన్నా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. సహ నటుడు విజయ్ వర్మతో డేటింగ్‌లో ఉన్నట్లు వచ్చిన వార్తలు నిజమేనని ఒప్పు్కుంది. దీంతో ఇన్నిరోజులుగా తమన్నాపై వస్తున్న పుకార్లకు ఒక్కసారిగా చెక్‌పడింది. అయితే ఎలాగూ ప్రేమలో ఉన్నట్లు ఒప్పుకుంది కాబట్టి ఇప్పుడు పెళ్లి ఎప్పుడనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

పెళ్లి జరగాలంటే దానికి టైమ్ రావాలి. నచ్చినప్పుడు చేసుకుంటా.. అందరికి పెళ్లిళ్లు అవుతున్నాయి కాబట్టి నేను చేసుకుంటా అని అనుకోకూడదు. పెళ్లి అంటే పార్టీలో ఎంజాయ్ చేయడం కాదు.. అదొక బాధ్యత. ఆ బాధ్యతను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామా? లేదా? అని చూసుకోవాలి. అప్పుడే పెళ్లి చేసుకోవడం ఉత్తమం అంటూ పెళ్లిపై తనకు ఉన్న అభిప్రాయాన్ని బయటపెట్టింది.

ఇక తన పెళ్లి విషయం గురించి మాట్లాడుతూ.. 30 ఏళ్లు వచ్చేసరికే పెళ్లి చేసుకుని.. ఇద్దరు పిల్లల్ని కనాలని అనుకున్నానని చెప్పుకొచ్చింది తమన్నా. చాలా ఏండ్ల క్రితమే సినిమాల్లోకి వచ్చా. సౌత్‌లో అన్ని భాషల్లో సినిమాలు చేశారు. ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించా. నా కెరీర్ మొదలు పెట్టిన సమయంలో మహా అయితే 10 ఏళ్లు ఇండస్ట్రీలో ఉంటా కావచ్చు. అని అనుకున్నా. అందుకే 30 ఏళ్లలోపు పెళ్లి కూడా చేసుకుని.. ఇద్దరు పిల్లలన్నీ కనేస్తానేమో అని అనుకున్నా. కానీ ఇప్పటికీ జనాలు ఆదరిస్తుండటంతో ఇండస్ట్రీలోనే కంటిన్యూ అవుతున్నా అని చెప్పుకొచ్చింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pawan Kalyan | నా చెప్పులు నాకు ఇప్పించండి ప్లీజ్‌.. పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ కౌంటర్‌

Adipurush | ఆదిపురుష్ సినిమా చూసేందుకు వచ్చిన హనుమంతుడు.. జై శ్రీరామ్ అంటూ మార్మోగిన సినిమా హాల్

Weather Updates | బిపర్‌జాయ్ ఎఫెక్ట్.. తెలంగాణలో వర్షాలు బంద్.. జూన్ చివరిదాకా ఎండలే !

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News