Friday, April 19, 2024
- Advertisment -
HomeLatest NewsGroup 2 syllabus | నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్ 2 సిలబస్‌లో మార్పులు చేసిన టీఎస్‌పీఎస్సీ

Group 2 syllabus | నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్ 2 సిలబస్‌లో మార్పులు చేసిన టీఎస్‌పీఎస్సీ

Group 2 syllabus | నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న గ్రూప్స్ నోటిఫికేషన్లను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. గ్రూప్స్ పోస్టుల భర్తీలో భాగంగా 783 గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ వచ్చింది. ఇంటర్వ్యూలు లేకుండా కేవలం రాత పరీక్ష ఆధారంగా ఈ కొలువులను భర్తీ చేస్తున్నారు. ఈ క్రమంలో నిరుద్యోగుల ఫోకస్ అంతా ఇప్పుడు దీనిపైనే ఉంది. ఈ క్రమంలో నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. గ్రూప్ 2 ఉద్యోగాల సిలబస్‌లో టీఎస్‌పీఎస్సీ పలు మార్పులు చేసింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పలు అంశాలను సిలబస్‌లో చేర్చింది. గ్రూప్ 2 లో మొత్తంగా నాలుగు పరీక్ష పేపర్లకు గానూ 600 మార్కులకు పరీక్ష జరుగుతుంది. వీటిలో పేపర్-1, 3 పేపర్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ పేపర్-2, 4లో మాత్రం పలు మార్పులు చేసింది.

పేపర్ -2లో..

సెక్షన్ -2లో భారత రాజ్యాంగం టాపిక్‌లో కొత్తగా రాజ్యాంగ సవరణ విధానం, సవరణ చట్టాలను ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఎలక్టోరల్ మెకానిజం – ఎలక్టోరల్ చట్టాలు, పార్టీ ఫిరాయింపు చట్టం చేర్చారు. భారతదేశంలో న్యాయ వ్యవస్థ – న్యాయ సమీక్ష; ఆర్థికంగా బలహీనవర్గాలకు ప్రత్యేక ప్రొవిజన్లు; జాతీయ మహిళ, మైనార్టీ, మానవ హక్కుల కమిషన్లు; జాతీయ సమగ్రత సమస్యలు, సవాళ్లు, తిరుగుబాట్లు, అంతర్గత సెక్యూరిటీ, అంతర్రాష్ట వివాదాలను చేర్చారు.

సెక్షన్ 3లో భారతీయ సాంఘిక నిర్మాణంలో ఎథ్నిసిటీ, మతం, మహిళలు అనే అంశాన్ని జోడించారు. సామాజిక సమస్యల్లో ట్రాన్స్‌జెండర్ సమస్యలు, సామాజిక ఉద్యమాలు అనే అంశంలో పౌర హక్కుల ఉద్యమాలు; తెలంగాణ సొసైటీలో తెలంగాణ రాష్ట్రంలోని సామాజిక సాంస్కృతిక లక్షణాలు, సమస్యలు, కష్టాల్లో శిల్పకారులు, సేవా సంఘాలు అంశాలను యాడ్ చేశారు.

పేపర్ 3, సెక్షన్ 1లో..

మొదటి సెక్షన్‌లో డెమోగ్రఫీ ( జనాభా శాస్త్రం)లో పలు అంశాలను జోడించారు. భారత దేశ జనాభా లక్షణాలు – జనాభా పరిమాణం, వృద్ధి రేటు – డెమోగ్రఫిక్ డివిడెండ్ – రంగాల వారీగా జనాభా – భారత దేశ జనాభా విధానాలు, జాతీయ ఆదాయం విభాగంలో జాతీయ ఆదాయ భాగాలు – ఆదాయాన్ని లెక్కించే పద్ధతులు – భారత దేశంలో జాతీయ ఆదాయ అంచనాలు, తలసరి ఆదాయం వంటి అంశాలను చేర్చారు.

ప్రాథమిక, ద్వితీయ రంగాలు

వ్యవసాయం, సంబంధిత రంగాలు, జాతీయ ఆదాయానికి వ్యవసాయ రంగం సహకారం, పంటల విధానం – వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదన – హరిత విప్లవం, నీటి పారుదల, ఫైనాన్స్, మార్కెటింగ్, వ్యవసాయ సబ్సిడీలు, ఆహార భద్రత అంశాలను యాడ్ చేశారు.

పరిశ్రమలు, సేవా రంగం

భారత దేశంలో పరిశ్రమల వృద్ధి, నిర్మాణం; జాతీయ ఆదాయానికి పరిశ్రమలు; సేవల రంగాల సహకారం; పారిశ్రామిక విధానాలు; భారీ తరహా పరిశ్రమలు; ఎంఎస్ఎంఈలు; ఇండస్ట్రియల్ ఫైనాన్స్; జాతీయ ఆదాయానికి సేవల రంగం కాంట్రిబ్యూషన్, సేవారంగం ప్రాముఖ్యత; సేవారంగం ఉప రంగాలు; ఆర్థిక మౌలిక సదుపాయాలు; భారత దేశ వాణిజ్యం వంటి అంశాలను కొత్తగా చేర్చారు.

ప్లానింగ్, నీతి ఆయోగ్, పబ్లిక్ ఫైనాన్స్

పంచవర్ష ప్రణాళికల వైఫల్యాలు; భారత దేశ బడ్జెట్, బడ్జెట్‌లో భావనలు, ఎఫ్ఆర్‌బీఎం, తాజా కేంద్ర బడ్జెట్, పబ్లిక్ రెవెన్యూ, పబ్లిక్ వ్యయం, పబ్లిక్ అప్పులు, ఫైనాన్స్ కమిషన్లను భాగాలు టీఎస్‌పీఎస్సీ చేర్చింది.

పేపర్-3 సెక్షన్ 2లో

తెలంగాణ ఎకానమీ నిర్మాణం, వృద్ధి; స్టే్ ఫైనాన్స్ ( థార్ కమిషన్ ) -2014 నుంచి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వృద్ది, అభివృద్ధి రంగాల వారీగా రాష్ట్ర ఆదాయం, తలసరి ఆదాయాన్ని జోడించారు.

జనాభా, మానవ వనరుల అభివృద్ధి

వ్యవసాయం ప్రాధాన్యత, వ్యవసాయ వృద్ధి రేటులోని జీఎస్‌డీపీ/జీఎస్‌వీఏకి వ్యవసాయం, అనుబంధ రంగాల కాంట్రిబ్యూషన్; భూ వినియోగం, భూ హోల్డింగ్ విధానం, పంటల విధానం, నీటి పారుదల సంబంధిత రంగాల వృద్ధి, అభివృద్ధి వ్యవసాయ విధానాలు, ప్రోగ్రామ్‌లు సిలబస్‌లో చేర్చారు

పరిశ్రమలు, సేవల రంగాలు

జీఎస్‌డీపీ/జీఎస్‌వీఏకి పారిశ్రామిక రంగం కాంట్రిబ్యూషన్, ఇండస్ట్రీ పాలసీ – జీఎస్‌డీపీకి సేవల రంగం కాంట్రిబ్యూషన్, సామాజిక ఆర్థిక మౌలిక సదుపాయాలు వంటి అంశాలను జోడించారు.

రాష్ట్ర ఫైనాన్స్‌, బడ్జెట్, పాలసీలు

రాష్ట్ర రెవెన్యూ, వ్యయం, అప్పు – రాష్ట్ర బడ్జెట్ – రాష్ట్ర సంక్షేమ పాలసీలు వంటి అంశాలను చేర్చారు.

పేపర్ -3లోని సెక్షన్ 3లో అభివృద్ధి, అండర్ డెవలప్‌మెంట్ లక్షణాలు, ఆర్థిక వృద్ధి కొలమానాలు, మానవ అభివృద్ధి సూచికలు ; నివేదికలు ; సామాజిక మౌలిక సదుపాయాలు అంశాలు జోడించారు. పేదరికం, నిరుద్యోగిత టాపిక్‌లో ఆదాయ అసమానతలు, నిరుద్యోగిత భావనలు, సంక్షేమ పథకాలు, ప్రాంతీయ అసమానతలు అంశాలు చేర్చారు. పర్యావరణం, సుస్థిర అభివృద్ధి కేటగిరీలో పర్యావరణ భావనలు; పర్యావరణ రక్షణ; కాలుష్యం రకాలు; కాలుష్య నియంత్రణ; పర్యావరణ ప్రభావాలు; భారతదేశ పర్యావరణ పాలసీలు అంశాలను టీఎస్‌పీఎస్సీ చేర్చింది.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Telangana Assembly Elections | తెలంగాణలో కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా ? మార్చిలో ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా ?

BRS Andhra Pradesh president | బీఆర్‌ఎస్‌ వైపు ఏపీ నాయకుల చూపులు.. ఏపీ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు అయనేనా?

Tamil nadu | ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డీఏ పెంచిన తమిళనాడు సీఎం

Chandrababu | చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట.. ముగ్గురు మహిళల మృతి.. పలువురి పరిస్థితి విషమం

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News