Friday, April 26, 2024
- Advertisment -
HomeNewsInternationalJaishankar in UN | పెరట్లోనే పాములు పెంచి ఇతరులనే కాటేయాలంటే ఎలా.. పాకిస్థాన్‌ జర్నలిస్టుకు...

Jaishankar in UN | పెరట్లోనే పాములు పెంచి ఇతరులనే కాటేయాలంటే ఎలా.. పాకిస్థాన్‌ జర్నలిస్టుకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కౌంటర్

Jaishankar in UN | అంతర్జాతీయ వేదికగా పాకిస్థాన్‌పై భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ పద్దతి మార్చుకోవాలని హితవు పలికారు. తమ చేష్టలను మార్చుకుని పొరుగు దేశాలపట్ల స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు. ముందుగా పాక్ తనకు అంటిన మరకను తుడుచుకోవాలని అన్నారు. ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయో గమనించాలన్నారు. ఆర్థిక‌వృద్ధి, పురోగతిపై దృష్టి పెట్టాలని హితవుపలికారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచం అవలంభించాల్సిన విధానాలపై ఐక్య రాజ్య సమితి ( United Nations ) భద్రతా మండలిలో భారత్ అధ్యక్షతన చర్చ జరిగింది. ఈ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడిన జైశంకర్.. ఉగ్రవాదం ముప్పు ఎక్కడి నుంచి మొదలైందనే విషయం ప్రపంచం మరచిపోలేదని గుర్తుచేశారు.

పాక్ జర్నలిస్టుకు గట్టి కౌంటర్..

అయితే ఈ సందర్భంగా పాకిస్థాన్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు జైశంకర్ గట్టికౌంటర్ ఇచ్చారు. దక్షిణాసియాలో ఇంకెన్నాళ్లు ఈ ఉగ్రవాదం ఉంటుందని పాక్ జర్నలిస్టు ప్రశ్నించారు. దీనికి సమాధానమిచ్చిన జైశంకర్.. మీ దేశ మంత్రిని ఈ ప్రశ్న వేస్తే బాగుంటుందన్నారు. దక్షిణాసియాలో ఇంకెంత కాలం ఉగ్రవాదాన్ని చూడాలనేది తెలుసుకోవాలంటే పాకిస్థాన్ మంత్రులనే ఈ ప్రశ్న అడగాలంటూ ఎద్దేవా చేశారు. పాకిస్థాన్ మంత్రులకే దీనిపై సమాధానం తెలిసే ఉంటుందని విమర్శించారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషించేదే పాకిస్థాన్ అన్న విషయం అందరికీ తెలుసన్నారు. ఉగ్రవాదానికి మూలం పాకిస్థానే అని ప్రపంచదేశాలన్నీ అనుకుంటున్నాయని గుర్తు చేశారు. ఇతరులపై నిందలు వేసేముందు తామేంటో తెలుసుకోవాలని హితవుపలికారు.

మంచి సలహాలు తీసుకునే అలవాటు ఆ దేశానికి లేదు..

ఇటీవల పాక్ మంత్రి ఒకరు భారత్‌ను ఉద్దేశిస్తూ కించపరిచే వ్యాఖ్యలు చేశారు. ముంబయి పేలుళ్ల సూత్రదారి హఫీజ్ సయీద్ ఇంటి ముందు గత ఏడాది బాంబు పేలుడు జరిగింది. ఈ దాడి వెనుక భారత్ కుట్ర ఉందని పాకిస్థాన్ ఇటీవల ఓ పత్రాన్ని విడుదల చేసింది. ఉగ్రవాదాన్ని భారత్ కంటే గొప్పగా ఎవరూ ఉపయోగించుకోలేరంటూ పాక్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై మీడియా ప్రశ్నించగా జైశంకర్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఆ మంత్రి వ్యాఖ్యలు విన్నానని, అయితే ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలన్నారు. గతంలో హిల్లరీ క్లింటన్ పాకిస్థాన్‌లో పర్యటించిన సమయంలో ఆమె అన్న మాటలను జైశంకర్ ఊటంకించారు. ‘ పెరట్లో పాములు పెంచుతున్నప్పుడు అవి పొరుగువారినే కాటేయాలని ఆశించకూడదు. అవి పెంచేవాళ్లను కూడా కాటేస్తాయి’ అని హిల్లరీ అన్న మాటలను గుర్తు చేశారు. ఇప్పటికీ పాకిస్థాన్‌కు మంచి సలహాలు తీసుకునే అలవాటు లేదంటూ ఘాటుగా విమర్శించారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే అన్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Drug case | డ్రగ్స్ కేసులో రుకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ నోటీసులు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కూడా

Avatar2 Review | అవతార్ 2 రివ్యూ.. జేమ్స్ కామెరూన్ మరోసారి మాయ చేశాడా?

Infosys Narayana murthy | ఆ విషయంలో తప్పు చేశా.. అలా చేసి ఉండాల్సింది కాదు.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు

How to wash silk sarees | పట్టుబట్టలపై మరకలు పడ్డాయా? ఈ చిట్కాలతో సులువుగా పోగొట్టుకోండి

Most dangerous snake | ప్రపంచంలోనే మోస్ట్‌ డేంజరస్‌ పాము.. ఇది కాటేస్తే 100 మంది బలికావాల్సిందే

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News