Friday, April 26, 2024
- Advertisment -
HomeBusinessInfosys Narayana murthy | ఆ విషయంలో తప్పు చేశా.. అలా చేసి ఉండాల్సింది కాదు.....

Infosys Narayana murthy | ఆ విషయంలో తప్పు చేశా.. అలా చేసి ఉండాల్సింది కాదు.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు

Infosys Narayana murthy | ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ( Infosys ) మొదలై నాలుగు దశాబ్దాలు పూర్తయింది. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తప్పుచేశానంటూ వ్యాఖ్యానించారు. ఇన్ఫోసిస్ ఫౌండర్ల వారసులను సంస్థలో కీలక స్థానాల్లోకి అనుమతించకపోవడం తాను చేసిన తప్పేనంటూ పేర్కొన్నారు. బెంగళూరులో జరిగిన ఇన్ఫోసిస్ 40వ వార్షికోత్సవంలో నారాయణమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు.

వారసులను దూరంగా ఉంచాల్సింది కాదన్న ఆయన… నాయకత్వ పదవులకు సంస్థ సహ వ్యవస్థాపకుల కుటుంబసభ్యులను దూరంగా ఉంచడం తప్పేనని బహిరంగంగా నారాయణమూర్తి వ్యాఖ్యానించారు. వారసులను నాయకత్వ పదవులకు తీసుకొస్తే ఇన్ఫోసిస్ చట్టబద్ధమైన ప్రతిభను కోల్పోతుందని భావించానని అన్నారు. గతంలో అన్న మాటలను వెనక్కి తీసుకుంటున్నానన్నారు. ఏ పదవికైనా అన్ని అర్హతలు కలిగి ఉన్నవాళ్లు ఇతరులతో సమానంగా అవకాశాలు కలిగి ఉండాల్సిందేనని ఇప్పుడు అనిపిస్తుందన్నారు.

ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిదంటే..

అర్హత లేని వ్యక్తులకు సంస్థ బాధ్యతలు అప్పగిస్తారేమోనని అప్పట్లో నాకు భయం ఉండేదని అందుకే అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. సంస్థ భవిష్యత్తు బలంగా ఉండాలని కోరుకునే ఆ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. మరోవైపు సంస్థ కో ఫౌండర్ నందన్ నీలేకని కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కూడా వారసులను నాయకత్వ స్థానాల్లోకి తీసుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు. నా తర్వాత చైర్మన్ బాధ్యతలు తీసుకోబోయే వ్యక్తి సంస్థ వెలిపలి వ్యక్తే అవుతారని అన్నారు. ఈ విషయంలో మరో ఆలోచనేమీ లేదని అన్నారు. అయితే ఎక్కువ కాలం మాత్రం ఈ స్థానంలో కొనసాగలేనని, అవసరం ఉన్నంత వరకు పదవిలో ఉంటానని నీలకని స్పష్టం చేశారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Aadhar Card Download | ఆధార్, పాన్ కార్డు అన్నీ వాట్సాప్ నుంచే ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Hallmark Gold | మీ బంగారు ఆభరణాలపై ఉన్న హాల్ మార్క్ అసలుదా.. నకిలీదా గుర్తించడం ఎలా?

Change Name in Aadhar | పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు మార్చుకోవడం ఎలా.. ఏమేం డాక్యుమెంట్లు అవసరం?

Personal Finance | ఒక వ్య‌క్తి ఎన్ని ఏళ్లు కిరాయి ఉంటే ఆ ఇల్లు అత‌ని సొంత‌మ‌వుతుంది?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News