Friday, April 19, 2024
- Advertisment -
HomeNewsAPYS Jagan | టీడీపీ, జనసేన పొత్తులపై ఏపీ సీఎం జగన్‌ ఇండైరెక్ట్‌గా పంచులు.. తోడేళ్లన్నీ...

YS Jagan | టీడీపీ, జనసేన పొత్తులపై ఏపీ సీఎం జగన్‌ ఇండైరెక్ట్‌గా పంచులు.. తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు !

YS Jagan | విలువలు లేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నామన్నారు ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి. అర్హత లేని వారంతా ప్రభుత్వం మీద రాళ్లు రువ్వుతున్నారని మండిపడ్డారు. నిజంగానే మీ బిడ్డ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మంచి చేయలేదని భావిస్తే.. పొత్తుల కోసం విపక్షాలు ఎందుకు వెంపర్లాడుతున్నాయని ప్రశ్నించారు. తనకు వ్యతిరేకంగా ఈ తోడేళ్లు ఎందుకు ఒక్కటవుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సినిమాల్లో కూడా మంచి చేసిన హీరోనే జనానికి నచ్చుతాడని, విలన్ ఎవరికీ నచ్చడని అన్నారు. జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో భాగంగా నిధుల విడుదల కోసం తిరువూరులో సభ నిర్వహించారు. సీఎం జగన్ ప్రసంగం అనంతరం బటన్ నొక్కి నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు.

‘‘ఈ తోడేళ్లు ఎందుకు ఏకమవుతున్నాయి? పొత్తుల కోసం వీళ్లంతా ఎందుకు వెంపర్లాడుతున్నారు? ఎన్ని కుట్రలు చేసినా చివరికి న్యాయమే గెలుస్తుంది. రామాయణమైనా, బైబిల్ అయినా ఖురాన్ లోనైనా మంచి చేసినవారే గెలుస్తారు. ఏ సినిమాలో అయినా సరే మంచి చేసిన హీరోనే నచ్చుతాడు. విలన్ ఎవరికీ నచ్చడు. దత్తపుత్రుడు, దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నాం’’ అంటూ పేర్కొన్నారు.

గ్రామగ్రామానికి, ఇంటింటికీ చేరిన అభివృద్ధి ఫలాలపై కానీ, రైతులకు, అక్కాచెల్లెళ్లకు, అవ్వాతాతలకు, బడిపిల్లలకు అందుతున్న సంక్షేమ ఫలాల విషయంలో కానీ.. ఇలా ఏ విషయంలోనూ తమ ప్రభుత్వంతో వారి పాలనను పోల్చుకోలేరని జగన్ విమర్శించారు. గతంలో దోచుకో, పంచుకో, తినుకో.. అనేలా డీపీటీ ప్రభుత్వం నడిచిందని జగన్ విమర్శించారు. అలాంటి వారు ఇప్పుడు ఏకమవుతున్నారని, విలువలు లేని దుష్టచతుష్టయంతో తాము పోరాడుతున్నామని జగన్ తెలిపారు.

పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే. ఒక కుటుంబం తలరాతను మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉంది. మన కలెక్టర్‌ ఢిల్లీరావు సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. చదువుకు పేదరికం అడ్డుకాకూడదు. మన దేశంలో విద్యాదీవన, వసతి దీవెన పథకాలు ఎక్కడా లేవు. కాలేజీ ఫీజులు ఎంతైనా సరే మనమే ఇస్తున్నాం. పూర్తి బాధ్యత మీ జగనన్నదే. గత ప్రభుత్వంలో కాలేజీ ఫీజులు బకాయిలు పెట్టేవారు. ఫీజులు కట్టలేక చదువులు మానివేసే పరిస్థితి రాకూడదని ఆయన అన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Allu Arjun | అల్లు అర్జున్ ట్విట్టర్‌లో నన్ను బ్లాక్ చేశాడు.. వైరల్‌గా మారిన వరుడు హీరోయిన్ ట్వీట్

Viral News | డంప్‌ యార్డులో అగ్ని ప్రమాదం.. రూ.100 కోట్ల ఫైన్‌ వేసిన ఎన్జీటీ

Viral News | అత్తారిల్లు చాలా దూరంగా ఉంది.. నేను పుట్టింటికి వెళ్లిపోతా.. పెళ్లయిన కాసేపటికే వరుడికి షాకిచ్చిన వధువు

Naveen Murder Case | నవీన్‌ మర్డర్‌ కేసులో కీలక మలుపు.. జైలు నుంచి నిహారిక విడుదల

Naatu Naatu | నాటు నాటు పెడితే కానీ.. నా కొడుకు అన్నం తినడం లేదు.. కరీనా కపూర్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News