Monday, March 27, 2023
- Advertisment -
HomeNewsAPRain Alert | వాతావరణ శాఖ అలర్ట్‌.. తెలంగాణలో మరో 2 రోజులు, ఏపీలో 3...

Rain Alert | వాతావరణ శాఖ అలర్ట్‌.. తెలంగాణలో మరో 2 రోజులు, ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు

Rain Alert | ఎండాకాలంలోనూ వరుణుడు తెలుగు రాష్ట్రాలను వదలట్లేదు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు మరో రెండు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం వరకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఉగాది నుంచి వర్షాలు తగ్గుముఖం పడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. ఆదిలాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు ఆదివారం ఉదయం నుంచి పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. సిద్దిపేట, కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌, నల్లగొండ, మేడ్చల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.

ఇక ఏపీలో రాబోయే మూడు రోజులు ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్‌, యానాంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని తెలిపింది. దక్షిణ కర్ణాటక నుంచి జార్ఖండ్‌ వరకు, రాయలసీమ, తెలంగాణ, ఒడిశాల మీదుగా ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ వరకు ప్రభావం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ ప్రభావం వల్లే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తున్నాయని పేర్కొన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Allu Arjun | అల్లు అర్జున్ ట్విట్టర్‌లో నన్ను బ్లాక్ చేశాడు.. వైరల్‌గా మారిన వరుడు హీరోయిన్ ట్వీట్

Viral News | డంప్‌ యార్డులో అగ్ని ప్రమాదం.. రూ.100 కోట్ల ఫైన్‌ వేసిన ఎన్జీటీ

Viral News | అత్తారిల్లు చాలా దూరంగా ఉంది.. నేను పుట్టింటికి వెళ్లిపోతా.. పెళ్లయిన కాసేపటికే వరుడికి షాకిచ్చిన వధువు

Naveen Murder Case | నవీన్‌ మర్డర్‌ కేసులో కీలక మలుపు.. జైలు నుంచి నిహారిక విడుదల

Naatu Naatu | నాటు నాటు పెడితే కానీ.. నా కొడుకు అన్నం తినడం లేదు.. కరీనా కపూర్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News