Friday, April 26, 2024
- Advertisment -
HomeNewsAPAP Intermediate exam schedule | ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ షెడ్యూల్‌ విడుదల.. మార్చి 15 నుంచి...

AP Intermediate exam schedule | ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ షెడ్యూల్‌ విడుదల.. మార్చి 15 నుంచి పరీక్షలు

AP Intermediate exam schedule | ఆంధ్రప్రదేశ్‌లో 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ మేరకు ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌కు సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు అధికారులు సోమవారం విడుదల చేశారు. మార్చి 15న ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 3న ముగియనున్నాయి. మార్చి 16న సెకండియర్‌ పరీక్షలు మొదలై ఏప్రిల్‌ 4వ తేదీన ముగియనున్నాయి.

కాగా, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 22న ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌ పరీక్ష, 24న పర్యావరణ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఈ రెండు పరీక్షలకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనున్నాయి. సెకండియర్‌ విద్యార్థులకు ఏప్రిల్‌ 15 నుంచి 25 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ప్రాక్టికల్స్‌ జరగనున్నాయి. ఆదివారం కూడా ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది.

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు:

మార్చి 15సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
మార్చి 17ఇంగ్లిష్ పేపర్-1
మార్చి 20గణితం పేపర్‌-1ఎ,
బోటనీ పేపర్-1
సివిక్స్-1
మార్చి 23గణితం-1బి
జువాలజీ పేపర్-1
హిస్టరీ పేపర్-1
మార్చి 25ఫిజిక్స్ పేపర్-1
ఎకనావిుక్స్‌ పేపర్-1
మార్చి 28రసాయనశాస్త్రం పేపర్-1
కామర్స్ పేపర్-1
సోషియాలజీ పేపర్-1
ఫైన్ ఆర్ట్స్& మ్యూజిక్ పేపర్-1
మార్చి 31పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1
లాజిక్ పేపర్-1
బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు)
ఏప్రిల్ 3మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1
జియోగ్రఫీ పేపర్-1

సెకండియర్ పరీక్షలు :

మార్చి 16సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్-2
మార్చి 18ఇంగ్లిష్‌ పేపర్-2
మార్చి 21గణితం పేపర్‌-2ఎ
బోటనీ, సివిక్స్-2.
మార్చి 24గణితం పేపర్-2బి
జువాలజీ పేపర్‌-2
హిస్టరీ పేపర్‌-2.
మార్చి 27ఫిజిక్స్ పేపర్‌-2
ఎకనామిక్స్‌ పేపర్‌-2
మార్చి 29కెవిుస్ట్రీ పేపర్‌-2
కామర్స్ పేపర్‌-2
సోషియాలజీ పేపర్-2
ఫైన్ ఆర్ట్స్& మ్యూజిక్ పేపర్-2
ఏప్రిల్ 1పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2
లాజిక్ పేపర్-2
బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్-2 (బైపీసీ విద్యార్థులకు)
ఏప్రిల్ 4మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్‌-2
జియోగ్రఫీ పేపర్‌-2
ఫిబ్రవరి 22ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్
ఫిబ్రవరి 24ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష
RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News