Home News AP AP CM Jaganmohan reddy | వచ్చే మూడు నాలుగు నెలల్లో నార్కొటిక్స్‌ రహిత రాష్ట్రంగా...

AP CM Jaganmohan reddy | వచ్చే మూడు నాలుగు నెలల్లో నార్కొటిక్స్‌ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మారాలి.. అధికారులకు సీఎం జగన్‌ ఆదేశం

AP CM Jaganmohan reddy | ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా మాదక ద్రవ్యాల వినియోగం ఉండొద్దని, ఆ లక్ష్యంతోనే పనిచేయాలని ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులకు సూచించారు. దీనికోసం పోలీసు, ఎక్సైజ్‌ శాఖలు కలిసి పనిచేయాలన్నారు. రాష్ట్రంలో ఎక్సైజ్‌, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ( SEB ) పనితీరుపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్‌.. వచ్చే మూడు నాలుగు నెలల్లో నార్కొటిక్స్‌ రహిత రాష్ట్రంగా ఏపీ మారాలని అన్నారు.

ముఖ్యంగా ఏపీలో నాలుగు అంశాలపై పోలీసు శాఖ దృష్టి పెట్టాలన్నారు. నార్కొటిక్స్‌తో పాటు అక్రమ మద్యాన్ని అరికట్టడం, సచివాలయాల్లోని మహిళా పోలీసుల పనితీరును మెరుగుపరచడం, దిశ చట్టం, యాప్‌లను పక్కగా అమలు చేసేలా చూడాలన్నారు. మరింత సమర్థంగా పనిచేసేందుకు దీనిపై ప్రతి మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించాలన్నారు. మద్యం నియంత్రణపై తీసుకున్న చర్యలు, గంజాయి సాగు అరికట్టడంపై సమీక్ష జరపాలని సూచించారు. నార్కోటిక్స్ నియంత్రణపై అన్ని కాలేజీలు, యూనివర్సిటీల వద్ద హోర్డింగులు ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు అవగాహన కల్పించేదిశగా అడుగులు వేయాలన్నారు.

గంజాయి సాగు చేస్తున్న వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలని అధికారులకు సూచించారు. గంజాయి సాగుదారుల ఆలోచనను మార్చేలా ఆపరేషన్‌ పరివర్తన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. ఇసుక ఎక్కువ ధరకు అమ్మినా.. అక్రమ మద్యంతో పాటు పబ్లిక్‌ ప్లేసెస్‌లో మద్యపానంపై ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించాలని ఎస్‌ఈబీ అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లోని 1.15లక్షల కుటుంబాలకు సంబంధించిన 2.82 లక్షల ఎకరాలకు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఆ భూముల అభివృద్ధికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని అధికారులను జగన్‌మెహన్‌ రెడ్డి ఆదేశించారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Vishal | రాజకీయాల్లోకి రావడం పక్కా కానీ.. కుప్పంలో చంద్రబాబు మీద పోటీపై క్లారిటీ ఇచ్చిన విశాల్

Koo vs Twitter | కూ సంస్థకు షాకిచ్చిన ట్విట్టర్.. అకౌంట్ తొలగింపు

Mrs world | 21 ఏళ్ల తర్వాత భారత్‌కు దక్కిన మిసెస్ వరల్డ్ కిరీటం.. విజేతగా నిలిచిన వైజాగ్ టీచర్

Exit mobile version