Home News AP Sankranti Holidays | గుడ్ న్యూస్.. సంక్రాంతి సెలవులు పొడిగించిన ప్రభుత్వం

Sankranti Holidays | గుడ్ న్యూస్.. సంక్రాంతి సెలవులు పొడిగించిన ప్రభుత్వం

Image Source: Pixabay

Sankranti Holidays | విద్యార్థులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి సెలవులను ఏపీ ప్రభుత్వం పొడిగించింది. ముందుగా జనవరి 11 నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. తాజాగా ఈ సెలవులను 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మార్పు చేసింది. జనవరి 19 నుంచి పాఠశాలలు పున : ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యా శాఖ రీ నోటిఫై చేసిన ఉత్తర్వులను విడుదల చేసింది.

అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం మొదట జనవరి 11 నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం భావించింది. అయితే 17వ తేదీన ముక్కనుమ ఉండటంతో ఆ రోజు కూడా సెలవు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన వినతిని పరిశీలించిన ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అకాడమిక్ క్యాలెండర్‌ను డిస్ట్రబ్ చేయకుండా ఒక్క రోజు మాత్రమే సెలవు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో జనవరి 11 నుంచి జనవరి 16వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ.. వాటిని జనవరి 12 నుంచి జనవరి 17వ తేదీకి మార్చింది. దీంతో పాటు 18వ తేదీన కూడా సెలవును పొడిగించింది.

తెలంగాణ స్కూళ్లకు 5 రోజులే సెలవులు

సంక్రాంతి పండుగా సందర్భంగా తెలంగాణలో జనవరి 13 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. 18వ తేదీన పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Viral News | నాకు కేన్సర్ అని అమ్మానాన్నలకు చెప్పొద్దు ప్లీజ్.. డాక్టర్‌ను వేడుకున్న ఆరేళ్ల బాలుడు.. కన్నీరు పెట్టిస్తున్న వైద్యుడి ట్వీట్!

Ayodhya Ram Mandir | అయోధ్య రామ మందిరంలోకి భక్తులను ఎప్పుడు అనుమతిస్తారు ? ఆలయ విశేషాలేంటి.. శిల్పులు ఎవరు ?

Telangana Tourist Places | తెలంగాణలోని ఈ ఆలయంలో 700 ఏళ్లుగా వెలుగుతున్న అఖండజ్యోతి.. గంభీరావుపేటలోనే

Peddagattu lingamanthula jathara | తెలంగాణలో జరిగే రెండో అతిపెద్ద జాతర ఇదే.. పెద్దగట్టు జాతర ప్రత్యేకత ఏంటి ? ఎలా వెళ్లాలి ?

Chitragupta Temple | హైదరాబాద్‌లో మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో చిత్రగుప్తుడి ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

Exit mobile version