Home Latest News Air India | ఎయిరిండియాలో మహిళపై మూత్ర విసర్జన కేసులో నిందితుడి అరెస్టు.. ఈ ఘటన...

Air India | ఎయిరిండియాలో మహిళపై మూత్ర విసర్జన కేసులో నిందితుడి అరెస్టు.. ఈ ఘటన తర్వాత ఏం జరిగిందో చెప్పిన లాయర్లు

air india pee case shankar mishra arrested

Air India | ఎయిరిండియా విమానంలో ఓ మహిళపై మూత్ర విసర్జన చేసి తప్పించుకు తిరుగుతున్న నిందితుడు శంకర్ మిశ్రాను బెంగళూరులో అరెస్టు చేశారు. గత ఏడాది నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ వచ్చిన విమానంలో వృద్ధురాలిపై శంకర్ మిశ్రా మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన దేశ్యవాప్తంగా సంచలనంగా మారింది. ఎయిరిండియాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై ఢిల్లీలో కేసు నమోదైంది. అప్పటి నుంచి పరారీలో ఉన్న మిశ్రాను ఢిల్లీ పోలీసులు శనివారం బెంగళూరులో అరెస్ట్ చేశారు.

టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌కు బాధిత మహిళ లేఖ రాయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీ వచ్చిన విమానం బిజినెస్ క్లాస్‌లో నవంబర్ 26న ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ఎయిర్ ఇండియా సిబ్బందికి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని బాధిత మహిళ ఆరోపించింది. ఎయిరిండియాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో శంకర్ మిశ్రాపై 30 రోజులపాటు ఎయిర్‌లైన్స్ నిషేధం విధించింది. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించడంతో ఢిల్లీలో కేసు నమోదైంది. అప్పటి నుంచి ముంబైలోని నిందితుడి నివాసానికి తాళం వేసి ఉంది. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో ఢిల్లీ పోలీసులు ఆయనపై లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు.

సోషల్ మీడియా, క్రెడిట్ కార్డుల లావాదేవీలపై నిఘా పెట్టిన పోలీసులు మిశ్రా బెంగళూరులో ఉన్నట్లు గుర్తించారు. శనివారం అరెస్టు చేశారు. అమెరికా సేవల సంస్థ వెల్స్ ఫార్గోలో భారత విభాగానికి ఉపాధ్యక్షుడిగా శంకర్ మిశ్రా పనిచేస్తున్నారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఆ సంస్థ మిశ్రాను ఉద్యోగం నుంచి తొలగించింది. మరోవైపు మిశ్రా వాదన మరోలా ఉంది. ఇప్పటికే బాధితురాలికి తగిన నష్టపరిహారం చెల్లించానని వివరించాడు. అయితే నెల రోజుల తర్వాత ఆ డబ్బును బాధితురాలి కుమార్తె వెనక్కి పంపించిందని చెప్పాడు. కాగా, బాధితురాలికి సంబంధించిన పాడైపోయిన బ్యాగులు, బట్టలను ఆమె పంపించగా.. నవంబర్ 30న వాటిని ఉతికించి ఇచ్చారని ఈ మేరకు మిశ్రా తరఫున న్యాయవాదులు ప్రకటన విడుదల చేశారు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Viral News | నాకు కేన్సర్ అని అమ్మానాన్నలకు చెప్పొద్దు ప్లీజ్.. డాక్టర్‌ను వేడుకున్న ఆరేళ్ల బాలుడు.. కన్నీరు పెట్టిస్తున్న వైద్యుడి ట్వీట్!

Ayodhya Ram Mandir | అయోధ్య రామ మందిరంలోకి భక్తులను ఎప్పుడు అనుమతిస్తారు ? ఆలయ విశేషాలేంటి.. శిల్పులు ఎవరు ?

Telangana Tourist Places | తెలంగాణలోని ఈ ఆలయంలో 700 ఏళ్లుగా వెలుగుతున్న అఖండజ్యోతి.. గంభీరావుపేటలోనే

Peddagattu lingamanthula jathara | తెలంగాణలో జరిగే రెండో అతిపెద్ద జాతర ఇదే.. పెద్దగట్టు జాతర ప్రత్యేకత ఏంటి ? ఎలా వెళ్లాలి ?

Chitragupta Temple | హైదరాబాద్‌లో మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో చిత్రగుప్తుడి ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

Exit mobile version