Saturday, April 27, 2024
- Advertisment -
HomeNewsAPFree Ration | తెల్ల రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఉచిత బియ్యం పంపిణీకి ఏపీ...

Free Ration | తెల్ల రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఉచిత బియ్యం పంపిణీకి ఏపీ సీఎం జగన్ నిర్ణయం

Free Ration | న్యూ ఇయర్ సందర్భంగా తెల్ల రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఏడాది పాటు ఉచిత బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఒక్క రూపాయికే కిలో బియ్యాన్ని అందిస్తున్నారు. అయితే ఈ బియ్యాన్ని 2023 జనవరి నుంచి 2023 డిసెంబర్ వరకు ఏడాది పాటు ఉచితంగా అందించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.

దేశవ్యాప్తంగా ఆహార భద్రత చట్టం కిందకు వచ్చే ( NFSA ) కార్డుదారులు అందరికీ ఏడాది పాటు ఉచిత బియ్యం అందించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అయితే ఎన్‌ఎఫ్ఎస్ఏ కార్డు దారులతో పాటు నాన్ ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులకు కూడా ఉచితంగా బియ్యం అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఉచిత బియ్యం పంపిణీ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రేషన్ దుకాణాల వద్ద ఈ మేరకు బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఉచిత బియ్యానికి సంబంధించి ఫిర్యాదుల కోసం 1967 లేదా 1800 425 0082 నంబర్లకు సంప్రదించవచ్చని తెలిపారు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

SI, Constable Mains | ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Job notifications | తెలంగాణలో కొనసాగుతున్న కొలువుల జాతర.. న్యూఇయర్‌ ముందు మరో నాలుగు నోటిఫికేషన్లు జారీ

Accident | ఇద్దరి ప్రాణాలు తీసిన న్యూఇయర్ జోష్.. బంజారాహిల్స్‌లో కారు బీభత్సం

Corona | చైనాలో రోజుకు 9 వేల కరోనా మరణాలు.. మార్చినాటికి 100 కోట్ల మందికి వైరస్!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News