Saturday, April 27, 2024
- Advertisment -
HomeNewsAPLPG Cylinder | సిలిండర్ తీసుకొచ్చినందుకు రూ.30 అడిగిన డెలివరీ బాయ్.. గ్యాస్ ఏజెన్సీకి లక్ష...

LPG Cylinder | సిలిండర్ తీసుకొచ్చినందుకు రూ.30 అడిగిన డెలివరీ బాయ్.. గ్యాస్ ఏజెన్సీకి లక్ష రూపాయలు ఫైన్

LPG Cylinder | గ్యాస్ సిలిండర్ ఇంటికి తీసుకొచ్చినందుకు డెలివరీ బాయ్‌లు అదనంగా డబ్బులు అడుగుతుంటారు. కొంతమంది ఎంత ఇస్తే అంత తీసుకుని వెళ్తారు.. కానీ మరికొందరు మాత్రం మాకు 50 కావాలి.. 100 కావాలని డిమాండ్ చేస్తుంటారు. అడిగినంత ఇవ్వకపోతే నానా గొడవ చేస్తుంటారు. డెలివరీ బాయ్‌కి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ఇలా ఓ డెలివరీ బాయ్ డబ్బు డిమాండ్ చేయడంతో గ్యాస్ ఏజెన్సీ చిక్కుల్లో పడింది. వినియోగదారుడికి రూ. లక్ష పరిహారం చెల్లించాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే ఏపీలోని అనంతపురంలో ఓ వినియోగదారుడికి గుత్తిరోడ్డులోని హనుమాన్ ఏజెన్సీలో హెచ్‌పీ గ్యాస్ కనెక్షన్ ఉంది. అక్కడ 2019 అక్టోబర్ 7న రీఫిల్ కోసం సిలిండర్ బుక్ చేసుకున్నాడు. ఆ సిలిండర్ డెలివరీ ఇచ్చేందుకు వచ్చిన డెలివరీ బాయ్ రూ.30 ఇవ్వాలని అడిగాడు. అందుకు అతను నిరాకరించడంతో ఛార్జీలు ఉంటాయి.. ఇవ్వాల్సిందేనని డెలివరీ బాయ్ పట్టుబట్టాడు. బిల్లులోనే డెలివరీ ఛార్జీలు ఉంటాయి కదా.. మళ్లీ ఎందుకు చార్జీలు ఇవ్వాలని ఆ వినియోగదారుడు ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహం చెందిన డెలివరీ బాయ్.. సిలిండర్ తీసుకుని ఇంటి ముందు నుంచి వెళ్లిపోయాడు.

డెలివరీ బాయ్ వ్యవహారాన్ని గ్యాస్ ఏజెన్సీ దృష్టికి తీసుకెళ్తే నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. డెలివరీ ఖర్చులు ఉంటాయని.. అవి డెలివరీ బాయ్‌లు అడుగుతూనే ఉంటారని సమర్థించుకున్నారు. ఈ విషయాన్ని పౌరసరఫరాల అధికారికి తెలియజేయడంతో సిలిండర్ తీసుకొచ్చి ఇంటి ముందు ఉంచి వెళ్లిపోయారు. మరుసటి నెలలో అతని గ్యాస్‌ కనెక్షన్‌ను మరో ఏజెన్సీకి ట్రాన్స్‌ఫర్ చేశారు.

తనకు సమాచారం ఇవ్వకుండా గ్యాస్ ఏజెన్సీని మార్చడంపై సదరు వినియోగదారుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. కలెక్టర్ సూచన మేరకు జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. సిలిండర్ లేకపోవడంతో పడిన ఇబ్బందులను వివరంగా పేర్కొంటూ ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన వినియోగదారుల ఫోరం.. గ్యాస్ ఏజెన్సీకి, ఏపీ పౌరసరఫరాల సంస్థకు నోటీసులు జారీ చేసింది. దీనికి స్పందించిన గ్యాస్ ఏజెన్సీ.. డెలివరీ బాయ్‌ని ఉద్యోగంలో నుంచి తీసేశామని.. పరిహారం చెల్లించమని వాదించింది. కానీ గ్యాస్ ఏజెన్సీ వాదనను వినియోగదారుల ఫోరం తోసిపుచ్చింది. వినియోగదారుడికి రూ. లక్ష పరిహారంగా చెల్లించాల్సిందేనని అనంతపురం జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యురాలు ఎం.శ్రీలత తీర్పునిచ్చింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Kerala Schools | ఇక స్కూళ్లలో సర్‌… మేడమ్ అనాల్సిన అవసరం లేదు… ఓన్లీ టీచర్‌.. ఆదేశాలు జారీ !

Rajashree Swain | ఇద్దరు క్రికెటర్లు మృతి.. అడవిలో అనుమానస్పదంగా మహిళా క్రికెటర్ మృతదేహం.. ఆత్మహత్యా ? హత్యా ?

Weather Report | ఈ శతాబ్దంలో ఇదే అత్యంత చలికాలం.. మరో వారంలో మైనస్ 4 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు

Ganga vilas | ప్రధాని మోదీ ప్రారంభించిన గంగా విలాస్ ఎక్కాలంటే 20 లక్షలు ఉండాల్సిందే.. ఈ క్రూయిజ్ స్పెషాలిటీ ఏంటి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News