Tuesday, July 23, 2024
- Advertisment -
HomeEntertainmentVijay Devarakonda | గూఢచారిగా మారిన విజయ్ దేవరకొండ.. ఆసక్తి రేకెత్తిస్తున్న #VD12 ప్రీలుక్ పోస్టర్

Vijay Devarakonda | గూఢచారిగా మారిన విజయ్ దేవరకొండ.. ఆసక్తి రేకెత్తిస్తున్న #VD12 ప్రీలుక్ పోస్టర్

Vijay Devarakonda | పవన్ కళ్యాణ్ తర్వాత తక్కువ టైమ్‌లో అంతటి క్రేజ్‌ను సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ అని ఆ మధ్య దిల్ రాజు ఓ సందర్భంలో అన్నాడు. దిల్ రాజు ఏ ఉద్దేశంతో అన్నాడో గానీ, అవి అక్షరాల సత్యం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. పాన్ ఇండియా హీరోగా ఎదిగాడంటే మామూలు విషయం కాదు. అప్పట్లో బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్లు ఇండస్ట్రీలోకి రావాలంటే చిరంజీవి, రవితేజను ఎలా ఆదర్శంగా తీసుకునేవారో.. ఇప్పుడు విజయ్ దేవరకొండను అలా ఆదర్శంగా తీసుకుంటున్నారు. అలా తన సక్సెస్ తో విజయ్ దేవరకొండ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. కానీ గత కొన్నేళ్లుగా విజయ్ దేవరకొండకు అస్సలు కలిసి రావడం లేదు.

ఎంత కష్టపడి చేసిన విజయ్ దేవరకొండ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఇటీవల భారీ అంచనాలతో రిలీజైన లైగర్ విజయ్ ను కోలుకోలేని దెబ్బ కొ ట్టింది.దీంతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్టు కొట్టాలనుకున్న విజయ్ కల.. కలగానే మిగిలిపోయింది. ప్రస్తుతం విజయ్ ఖుషీ సినిమా చేస్తున్నాడు. రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ కు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే విజయ్ తాజాగా తన నెక్స్ట్ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ను ప్రకటించాడు. మళ్ళీరావా, జెర్సీ వంటి సినిమాలతో మెప్పించిన గౌతమ్ తిన్ననూరితో తన తదుపరి సినిమా చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించాడు. ఈ మేరకు ప్రీలుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు.

సముద్ర తీరంలో యుద్ధ సన్నివేశాన్ని తలపించేలా మంటల్లో కాలిపోతున్న పడవలతో పోస్టర్ ను ఆసక్తికరంగా డిజైన్ చేశారు. అంతేకాకుండా విజయ్ పోలీస్ దుస్తుల్లో మొహానికి ముసుగు ధరించి గూఢాచారిగా అవతారం ఎత్తినట్లు పోస్టర్ లో చూపించారు. నేను ఎవరికి ద్రోహం చేశానో చెప్పడానికి నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలియదు అంటూ పోస్టర్ పైన ఉన్న కొటేషన్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమాను సితార ఎంటర్టైనమెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

కెరీర్ బిగెనింగ్ లో పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా వంటి వరుస హిట్లతో దూసుకుపోయిన విజయ్.. ఈ మధ్య కాస్త డల్ అయ్యాడు. గత నాలుగైదేళ్లుగా విజయ్ కు ఒక్క హిట్టు కూడా లేదు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ వంటి హ్యట్రిక్ డిజాస్టర్ లతో చెత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇక ప్రస్తుతం విజయ్ ఆశలన్నీ ఖుషీ సినిమాపైనే ఉన్నాయి. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈపాటికే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా సమంత ఆరోగ్యం కారణంగా షూటింగ్ ఆలస్యమవుతూ వస్తుంది. ఇక ప్రస్తుతం సమంత ఆరోగ్యం నిలకడగా ఉండటంతో త్వరలోనే షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Veerasimhareddy first day collections | తొలిరోజే హాఫ్ సెంచరీ కొట్టిన బాలకృష్ణ.. కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డు

Shruti Haasan | నా జ్వరం కాస్త మానసిక సమస్యగా మారిందన్నమాట.. అనారోగ్య వార్తలపై స్పందించిన శ్రుతిహాసన్‌.

Saipallavi | సాయిపల్లవికి ఏమైంది.. ఛాన్సులు రావడం లేదా? తనే ఒప్పుకోవడం లేదా?

Waltair Veerayya | వాల్తేరు వీరయ్య సినిమా ఓటీటీకి వచ్చేది అప్పుడే..

Waltair Veerayya Review | వాల్తేరు వీరయ్య రివ్యూ.. చిరంజీవి, రవితేజ పూనకాలు తెప్పించారా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News