Friday, March 31, 2023
- Advertisment -
HomeLatest NewsAir Asia | ఎయిర్ ఏషియాకి షాకిచ్చిన డీజీసీఏ.. 20 లక్షల జరిమానా!

Air Asia | ఎయిర్ ఏషియాకి షాకిచ్చిన డీజీసీఏ.. 20 లక్షల జరిమానా!

Air Asia | దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియాకు పౌర విమానయాన ప్రాధికార సంస్థ గట్టి షాక్ ఇచ్చింది. ఎయిర్ ఏషియా కంపెనీకి రూ.20 లక్షల జరిమానా విధించింది. అంతర్జాతీయ పౌర నిబంధనల ప్రకారం పైలట్‌కు నిర్వహించే సామర్థ్య పరీక్షల సమయంలో సరైన నిబంధనలు పాటించడంలో ఎయిర్‌ ఏషియా విఫలమైనట్లు డీజీసీఏ గుర్తించింది.

డీజీసీఏ నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించడంలో విఫలమైనందుకు గానూ ఎయిర్‌లైన్స్‌ ట్రైనింగ్‌ విభాగాధిపతిని మూడు నెలల పాటు విధుల్లో నుంచి తొలగించింది. ట్రైనింగ్‌ టీమ్‌లో ఉన్న ఎనిమిది మందికి రూ.3 లక్షల ఒప్పున జరిమానా విధించింది. వీటితో పాటు షో కాజ్ నోటీసులు కూడా పంపింది. రూల్స్ ఎందుకు పాటించలేదో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఇప్పటికే తరచూ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తుతున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఫలితంగా డీజీసీఏ అన్ని సంస్థలపైనా ప్రత్యేక నిఘా పెడుతోంది. ఏ చిన్న లోపం ఉందని తెలిసినా వెంటనే కఠిన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఎయిర్ ఏషియాను మందలించి జరిమానా వేసింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

USA | చైనా గూఢచార బెలూన్ తర్వాత మళ్లీ అమెరికా గగనతలంలోకి అనుమానాస్పద వస్తువు

Minister KTR | మెట్రో టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచితే ఊరుకోం.. అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ హెచ్చరిక

KA Paul | సక్సెస్.. కేసీఆర్ బర్త్ డే నాడు సెక్రటేరియట్ ప్రారంభం కాకుండా ఆపేశా.. కేఏ పాల్

Single man | 38 ఏళ్లు వచ్చినా పెళ్లి ఊసే ఎత్తట్లేదని కొడుకుపై డౌట్‌తో ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లి.. అసలు సమస్య ఏంటో తెలిసి షాక్ !

Ration Cards | తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News