Home News International Kim Jong Un | 40 రోజులుగా ఆచూకీ లేని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్.....

Kim Jong Un | 40 రోజులుగా ఆచూకీ లేని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్.. ఆయన ఆరోగ్యం బాగానే ఉందా?

Kim Jong Un | ఉత్తర కొరియా పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్. తాను తీసుకునే కఠిన నిర్ణయాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే కిమ్.. కొద్ది రోజులుగా కనిపించడం లేదు. దాదాపు 40 రోజులుగా ఆయన నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అధికారిక కార్యక్రమాల్లోనూ కిమ్ కనిపించడం లేదు. దీంతో కిమ్‌కు ఏమైందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో కూడా ఓసారి కిమ్ ఆరోగ్యం బాగోలేదంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పలు అధికారిక కార్యక్రమాలకు కిమ్ సోదరి పాల్గొనడంతో రకరకాల అనుమానాలు మొదలయ్యాయి. కిమ్ పరిస్థితి దారుణంగా ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. కానీ వాటన్నింటికీ చెక్ పెడుతూ కిమ్ ఫొటోలను బయటి ప్రపంచానికి విడుదల చేశారు. ఇప్పుడు కూడా సుదీర్ఘకాలంగా కనిపించకపోవడంతో కిమ్ ఆరోగ్యంపై మళ్లీ అలాంటి వార్తలే వస్తున్నాయి. పైగా ఆదివారం జరిగిన పొలిట్ బ్యూరో సమావేశానికి కూడా కిమ్ హాజరు కాలేదు. ఇక్కడ ఆలోచించాల్సిన మరో విషయం ఏంటంటే కిమ్ గత 40 రోజులుగా జాడ లేరు. 2014 తర్వాత దాదాపు 40 రోజులకు పైగా అదృశ్యం కావడం ఇదే తొలిసారి. దీంతో కిమ్ ఆరోగ్యంపై చాలా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మరికొద్ది రోజుల్లో ఉత్తర కొరియాలో కొరియన్‌ పీపుల్స్ ఆర్మీ 75 వ వార్షికోత్సవాలు జరగనున్నాయి. రాజధాని ప్యాంగ్‌యాంగ్ కూడా ప్రత్యేక పరేడ్ కోసం ముస్తాబవుతోంది. ఇంతటి విశిష్టమైన కార్యక్రమానికి సన్నాహాలు జరుగుతుంటే… కిమ్‌ ఎక్కడా కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మొన్న జరిగిన పొలిట్‌ బ్యూరో సమావేశంలో కూడా ఎక్కడా కిమ్‌ జాడ కనపడనే లేదు. సోమవారం నాడు జరిగిన మిలిటరీ కమిషన్‌ మీటింగ్‌కి కిమ్ వచ్చారంటూ అధికారిక మీడియా సంస్థ ప్రకటించినప్పటికీ.. అందుకు సంబంధించిన ఫోటోలను మాత్రం విడుదల చేయలేదు. దీంతో సందేహాలు అలాగే ఉండిపోయాయి.

Exit mobile version