Home Lifestyle Health Eyes | చలికాలంలో మీ కండ్లు జాగ్రత్త.. లేదంటే ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది..

Eyes | చలికాలంలో మీ కండ్లు జాగ్రత్త.. లేదంటే ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది..

Eyes | చలికాలం ( Winter ) వచ్చిందంటే చాలు కంటి సమస్యలు మొదలవుతాయి. కంటి సమస్యల పట్ల అప్రమత్తంగా లేకుంటే కంటి చూపుకే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చలి తీవ్రత పెరిగినా కొద్దీ కండ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంతకీ.. శీతాకాలంలో కండ్లకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు వస్తాయి ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

సాధారణంగా చలికాలంలో ఎక్కువగా కండ్ల కలక, ఆశ కురుపు వంటి వైరల్, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు ఇబ్బంది పెడుతుంటాయి. చిన్నా పిల్లల నుంచి పెద్దవారి వరకు వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. వీటిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిర్లక్ష్యం చేస్తే కంటిచూపుకు ప్రమాదం.

కండ్ల కలక.. వైరస్‌ వల్ల వచ్చే వ్యాధి, వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అంటువ్యాధి లాంటిదే. ఒకరి నుంచి ఇంకొకరి సులువుగా వ్యాపిస్తుంది. కాబట్టి కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

కండ్ల కలక లక్షణాలివే..

ఉదయం లేవగానే కండ్లు అంటుకుని పోయి.. తెరవడానికి ఇబ్బంది అవుతుంది. దీనికి తోడు కండ్లలోంచి పసి కారడం, కండ్లు నొప్పిగా ఉంటాయి. కండ్లలో ఇసుక పడినట్లుగా ఉండి.. కండ్లు ఎర్రబడతాయి. ఎప్పుడూ నీరు కారుతూ ఉంటుంది.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

కండ్ల కలక సోకిన వారి టవల్స్‌, ఖర్చీఫ్‌లను ఇతరులు వాడొద్దు. చల్లగాలిలో తిరగొద్దు. ఒకవేళ తిరగాల్సి వచ్చినా.. కండ్లకు నల్లని అద్దాలు పెట్టుకోవాలి. ఇది వచ్చిన వారికి కుటుంబసభ్యులు దూరంగా ఉండాలి. వైద్యల సలహా మేరకు ఐ డ్రాప్స్‌ వేసుకోవాలి. మరీ నొప్పిగా ఉంటే వైద్యులను సంప్రదించాలి. నిర్లక్ష్యం చేస్తే కంటిచూపుకు ప్రమాదం ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రతిరోజు కాచి చల్లార్చిన నీటిలో కండ్లు పెట్టి అటూ ఇటూ తిప్పాలి. కంటి చుట్టుపక్కల, కంటి రెప్పలను శుభ్రంగా కడుక్కోవాలి.

ఆశ కురుపు.. లక్షణాలు

కంటిచూపు మందగించిన వారిలో ఆశ కురుపు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌ వల్ల కంటిపైన కురుపు వస్తుంది. దీన్నే ఆశ కురుపు అంటారు. చల్లని గాలులు వీచే సమయంలోనే ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే కండ్ల పరీక్షలు చేపించుకోవాలి. వైద్యుల సూచనల మేరకు అద్దాలు వాడాలి. కన్ను వాపు రావడం, నొప్పి ఎక్కువగా ఉండటం దీని లక్షణాలు.

నోటి దుర్వాసనకు చెక్‌ పెట్టండిలా

  • ప్రతి రోజూ ఉదయం లేవగానే.. రాత్రి పడుకునేప్పుడు బ్రష్‌ చేసుకోండి.
  • బ్రష్ చేసుకున్నాక టంగ్‌ క్లీనర్‌తో నాలుకను 30 స్క్రబ్‌ చేసి శుభ్రం చేసుకోండి. ఫలితంగా బ్యాక్టిరీయా తొలగిపోతుంది.
  • పిప్పిపళ్లు ఉన్నవాళ్లు నిర్లక్ష్యం చేయకుండా వాటిని ఫిలింగ్‌ చేసుకోండి.
  • ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తగ్గించుకోవాలి. ఏదేనీ ఆహారం తీసుకున్నప్పుడే దుర్వాసన వస్తుందంటే.. దాన్ని పరిమితంగా తినడం బెటర్.
  • చిగుళ్లపై పుండ్లు ఉంటే తప్పనిసరిగా దంత వైద్యులను సంప్రదించాలి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Obesity | అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? రాత్రివేళలో భోజనానికి బదులు వీటిని తీసుకోండి..

Tips to sleep | బోర్లా పడుకుంటే ప్రమాదమా.. ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్టేనా ? వైద్యులు ఏం చెబుతున్నారు?

Wrinkles | న‌లభై ఏళ్లకే శరీరం ముడతలు పడుతోందా.. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.. !

Beauty tips for lips | చ‌లికాలంలో పెద‌వులు అందంగా కనిపించాలా?

Exit mobile version